నెల్లిమర్ల జనవరి 5,
విజయనగరం జిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్ర ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలు సిద్ధమవుతుం డగా...ఇప్పటికే కొందరిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. రామతీర్థం సందర్శనకు వెళ్లకుండా స్థానిక రామతీర్థం కూడలి వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశించారు. ఇందులో భాగంగానే సోము వీర్రాజును ముందస్తుగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోము వీర్రాజుతోపాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని నెల్లిమర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు.దింతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చలో రామతీర్థం కార్యక్రమానికి వెళ్లే బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ను పోలీసులు అడ్డుకున్నారు.ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తమను అడ్డుకోవడంపై రమేష్ అసహనం వ్యక్తం చేశారు.