YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

50 వేల సాధు సంతువులతో చలో రామతీర్థం... అఖిల భారత హిందూ మహాసభ వెల్లడి

50 వేల సాధు సంతువులతో చలో రామతీర్థం... అఖిల భారత హిందూ మహాసభ వెల్లడి

విజయవాడ, జనవరి 5 
విజయనగరం జిల్లా రామతీర్థం లోని బోడికొండపై గల చారిత్రాత్మక ఆలయంలో శ్రీరాముని విగ్రహం శిరస్సు ఖండించిన దుశ్చర్యకు నిరసనగా త్వరలో 50 వేలమంది సాధు సంతువులతో చలో రామతీర్థం కి పిలుపు ఇవ్వనున్నట్లు అఖిల భారత హిందూ మహాసభ ప్రధానకార్యదర్శి డా.జి.వి ఆర్ శాస్త్రి తెలిపారు.   ఒక ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హిందువులు పవిత్రంగా కొలిచే శ్రీరాముని సిరస్సు ఖండించి హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపరిచారని,ఇంతవరకు ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని అరెస్టు చెయ్యక పోవటం వెనుక ఏ ఉద్దేశం ఉందని ప్రశ్నించారు.పాకిస్థాన్ లో హిందు దేవాలయాలను కొలగొడితే తీవ్రంగా ప్రతిఘటించిన తమ సంస్థ ఈ విషయం వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.ఇటీవల తాను సీబీఐ డైరెక్టర్ తో మాట్లాడి అంతర్వేది రధం దగ్ధం కేసు విషయం గూర్చి అడగ్గా అసలు తమకు దర్యాప్తు చెయ్యమని ఎవరుకోరలేదన్నారని శాస్త్రి చెప్పారు. అయితే రాష్ట్రప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరినట్లు ప్రకటించిందని,ఆప్రకారమే తాను వివరణ కోరగా ఈ విషయం తెలిపారని ఆయన చెప్పారు.హిందు దేవాలయాలను ఇండోమెంట్ శాఖల నుండి వేరుచెయ్యలని ఇప్పటికే సుప్రీం కోర్ట్ ఆదేశించినా అమలు జరగటంలేదని,తాము అన్ని రాష్ట్రాల్లోని ఆలయాలను పర్యవేక్షించేందుకు గాను సెంట్రల్ బోర్డు ఆ టెంపుల్ అథారిటీ ని ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరుతున్నామని శాస్త్రీ చెప్పారు.

Related Posts