YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సహజ వాయువు పైప్‌లైన్ ప్రాజెక్టును ప్రారంభించిన మోడీ

సహజ వాయువు  పైప్‌లైన్ ప్రాజెక్టును ప్రారంభించిన మోడీ

న్యూఢిల్లీ జనవరి 5 
కేరళ రాష్ట్రం లోని కొచ్చి-మంగ‌ళూరు మ‌ధ్య 3 వేల కోట్ల వ్యయం తో నిర్మించిన న్యాచుర‌ల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కేరళ, కర్నాటక రాష్ట్రాల ప్రజలకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో జరిగిన అభివృద్ధి గురించి తాను మాట్లడనని, కొన్నేళ్లుగా  మాత్రం దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.  కేరళలోని కొచ్చి నుంచి కర్నాటకలోని మంగళూరు వరకు ఈ గ్యాస్ పైపులైను నిర్మించారు. ఈ కార్యక్రమంలో కేర‌ళ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల సిఎంలు, గ‌వ‌ర్న‌ర్‌లు, కేంద్ర పెట్రోలియం, స‌హ‌జ వాయువు శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts