వాషింగ్టన్ జనవరి 5
ఇండియాకు మరోసారి వార్నింగ్ ఇచ్చింది అగ్రరాజ్యం అమెరికా రష్యాతో ఇండియా చేసుకున్న ఎస్-400 రక్షణ వ్యవస్థ కొనుగోలు డీల్‌పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డీల్‌పై ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తే ఇండియాపై ఆంక్షలు తప్పవని యూఎస్ కాంగ్రెషనల్ రిపోర్ట్ హెచ్చరించింది. అక్కడి కాంగ్రెస్‌కు రిపోర్ట్ చేసే ది కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) ఈ నివేదికను రూపొందించింది. ఇదొక స్వతంత్ర సంస్థ కావడం గమనార్హం. ఈ సంస్థే ఇప్పుడు ఇండియాపై ఆంక్షలు విధించాలని సూచిస్తోంది. రష్యా నుంచి ఇండియా ఎస్-400 రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడం అనేది.. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్‌ంన్స్ యాక్ట్ కింద ఇండియాపై అమెరికా ఆంక్షలకు కారణమవుతుందని సీఆర్ఎస్ స్పష్టం చేసింది.ఈ సీఆర్ఎస్ ఇచ్చింది అధికారిక నివేదిక కాకపోయినా.. దీని ఆధారంగా అమెరికా చట్ట సభల ప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే వీలు కలుగుతుంది. ఇండియా, రష్యా 2018, అక్టోబర్‌లో 500 కోట్ల డాలర్ల విలువైన ఎస్-400 మిస్సైల్ రక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఐదు మిస్సైల్ రక్షణ వ్యవస్థలను రష్యా.. ఇండియాకు అందించనున్నది. అమెరికా మొదటి నుంచీ హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఈ డీల్‌పై ముందుకే వెళ్లాలని ఇండియా నిర్ణయించింది. ఇప్పటికే రష్యాతో ఇదే డీల్ కుదుర్చుకున్న టర్కీపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.