YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఎవ‌రైనా ఎప్పుడైనా రాజీనామా చేయ‌వ‌చ్చు: మ‌మ‌తా బెన‌ర్జి

ఎవ‌రైనా ఎప్పుడైనా రాజీనామా చేయ‌వ‌చ్చు: మ‌మ‌తా బెన‌ర్జి

కోల్‌క‌తా జనవరి 5  
ఎవ‌రైనా ఎప్పుడైనా రాజీనామా చేయ‌వ‌చ్చ‌ని, ఎవ‌రి ఇష్టానుసారం వారు రాజీనామా చేసుకునే స్వేచ్ఛ ఉంటుంద‌ని ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జి వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రి, భార‌త మాజీ క్రికెట‌ర్ ల‌క్ష్మీర‌త‌న్ శుక్లా త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన నేప‌థ్యంలో మ‌మ‌త పైవిధంగా స్పందించారు. అయితే, ఆట‌లకు ఎక్కువ స‌మ‌యం కేటాయించాల‌న్న ఉద్దేశంతో తాను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని శుక్లా రాజీనామా లేఖ‌లో పేర్కొన్న‌ట్లు మ‌మ‌తా బెన‌ర్జి వెల్ల‌డించారు. ఎమ్మెల్యేగా మాత్రం కొన‌సాగుతాన‌ని తెలిపిన‌ట్లు చెప్పారు. ఈ విష‌యాన్ని తృణ‌మూల్ కాంగ్రెస్‌కు నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని మ‌మ‌త పేర్కొన్నారు.  

Related Posts