YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ వైపు చూస్తున్న మాజీలు

వైసీపీ వైపు చూస్తున్న మాజీలు

వైసీపీలో జోష్ పెరిగిపోయింది. అధికార టీడీపీలో కాకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో చేరికలు కొనసాగతుండటం ఫ్యాన్ పార్టీకి శుభపరిణామంగా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే జగన్ పాదయాత్రలో అనేక మంది నేతలు పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వీడిపోయినా జగన్ మనోస్థైర్యాన్ని కోల్పోకుండా పాదయాత్ర చేపట్టడం, ప్రత్యేక హోదా నినాదాన్ని అందిపుచ్చుకోవడం పార్టీకి కలిసి వచ్చినట్లు భావిస్తున్నారు.రాం భూపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పటికీ పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పనిచేయలేదు. కేవలం పాణ్యం నియోజకవర్గానికే ఆయన పరిమితమయ్యారు. ఇప్పుడు రాం భూపాల్ రెడ్డి వైసీపీలో చేరతానని చెప్పడంతో ఆ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే పాణ్యం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరు కుటుంబం పరిస్థితి ఏంటన్న చర్చ కూడా జరుగుతోంది. గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి ఇప్పటికే వైసీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మరి రాంభూపాల్ రెడ్డి పార్టీలో చేరితే వారి గమ్యం ఎటు అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే వారితో మాట్లాడిన తర్వాతనే జగన్ రాంభూపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద వైసీపీలో చేరికల హడావిడి మాత్రం బాగా కన్పిస్తుంది.తాజాగా పాణ్యం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసారి రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి గత ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అయితే ఏపీలో బీజేపీ చేసిన అన్యాయాన్ని గ్రహించిన రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. తాను వైసీపీలో చేరబోతున్నట్లు సమావేశంలోనే రాంభూలపాల్ రెడ్డి ప్రకటించగా ఆయన మద్దతుదారులు నినాదాలతో హోరెత్తించారు.రాం భూపాల్ రెడ్డి  ఐదుసార్లు శాసనసభ్యుడిగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా. ముందుగా రాం భూపాల్ రెడ్డి తన అనుచరుల నుంచి అభిప్రాయాలను సేకరించడం విశేషం. వారిలో ఎక్కువమంది వైసీపీలో చేరాలని సూచించడం విశేషం. రాజశేఖర్ రెడ్డి పాణ్యం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని, ఆయన తనయుడు జగన్ పార్టీలో చేరడమే మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో రాంభూపాల్ రెడ్డి కూడా అందుకు సమ్మతించి తాను జగన్ పార్టీలోనే చేరతానని ప్రకటించారు.

Related Posts