YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

అప్పుల్లో రైతులు...

అప్పుల్లో రైతులు...

యంలో డబ్బుల్లేకపోయినా ప్రభుత్వమిచ్చిన నేతన్న నేస్తం రూ.24 వేలుకు తోడు రెండు వేలు తక్కువ వస్తే బయట వేరే వారి నుంచి అప్పు తెచ్చి బ్యాంకులో ముందున్న అప్పు మొత్తం చెల్లించాం. కొత్తగా అప్పు ఇవ్వండి సార్‌ బ్యాంకు అధికారులను ప్రాధేయపడ్డాం. చేనేత కార్మికులకు కొత్తగా రుణం ఇచ్చేది లేదంటూ వారు తెగేసి చెప్పారు. ఈ క్రమంలో బయట బాకీవాళ్ల ఒత్తిడి ఎక్కువైంది. దీనికితోడు లాక్‌డౌన్‌ సమయంలో పనిలేక కుటుంబం గడవటమే కష్టమైంది. బయట చేసిన రూ.4 లక్షలకు నెలకు రూ.8 వేలు వడ్డీ కట్టాల్సి వచ్చింది. పది నెలలుగా ఇంటి అద్దె కూడా కట్టలేదు. కుటుంబ పోషణ భారం అయింది. ఈ సమస్యలను తాళలేక నా భర్త ఇంట్లోనే మగ్గానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయాం. నాకు ఆరోగ్యం బాగోలేదు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు మూడో తరగతి, ఇంకొకరు ఒకటో తరగతి చదువున్నారు. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియక నిత్యం నరకయాతన అనుభవిస్తున్నాం' అంటూ అనంతపురం జిల్లా ధర్మవరంలోని సంజరు నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు అవ్వారు బాలాజీ భార్య కన్నీటి పర్యంతమైంది. చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోవడంతో వేలాది మంది నేతన్న కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఈ విధంగానే ఉంది. అప్పుల బాధతో జిల్లాలో గతేడాది మొత్తం 14 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో నలుగురు గత నెలలో బలవన్మరణం చెందారు. ఈ పరిస్థితి చేనేత సంక్షోభం తీవ్రతకు అద్దం పడుతోంది. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఏ మాత్రమూ సాయం అందడం లేదు. దీంతో, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. సంక్షోభంలో ఉన్న చేనేత రంగం కోవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా మరింత దయనీయంగా మారింది. లాక్‌డౌన్‌తో వస్త్ర దుకాణాలన్నీ మూతపడ్డాయి. ఈ సమయంలో చేనేత కార్మికుడికి పనిలేకుండాపోయింది. మార్చి నుంచి ఆగస్టు వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం కింద ఇచ్చిన రూ.24 వేలతో కొంతకాలం జీవనం నెట్టుకొచ్చారు. అయినా, ఈ సాయం నేతన్నలను ఆదుకోలేక పోయింది. ఆరు నెలల పాటు ఉపాధి లేకపోవడంతో సమస్యలు అధికమయ్యాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా వ్యాపారాలు ఊపందుకోలేదు. గతంతో పోలిస్తే 50 శాతం మాత్రమే డిమాండ్‌ ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో గత రెండు మాసాలూ కొంత పని లభించింది. ఈ నెల మళ్లీ అన్‌సీజన్‌ మొదలు కావడంతో చేనేత కార్మికుల కష్టాలు మళ్లీ తీవ్రం అయ్యాయి. పని ఉన్నా కార్మికులకు రోజుకు రూ.150 మించి కూలి గిట్టడం లేదుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపెద్ద పరిశ్రమలకు రుణమాఫీలు, కొత్తగా రుణాలు ఇచ్చాయి. చేనేత పరిశ్రమకు అటువంటి ప్రోత్సాహకం ఇవ్వలేదు. నేతన్న నేస్తం పథకం కొంత ఉపశమనమే అయినా, చేనేత కార్మికుడికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహకం లేదు. చేనేతను కుటీర పరిశ్రమగా గుర్తించాలి. కార్మికుడు నేసిన చీరకు కనీస ధర నిర్ణయించాలి. కేరళ తరహాలో కనీస ధర కంటే తక్కువగా చీర అమ్మకం జరిగితే తగ్గిన మొత్తాన్ని ప్రభుత్వం రాయితీగా ఇవ్వాలి. దీనివల్ల కార్మికుడికి నికరమైన ఆదాయం ఉంటుంది. అప్పులు ఊబిలోకి నెట్టివేయబడకుండా ఉండేందుకు వీలు కలుగుతుంది. నేతన్న బజార్లను ఏర్పాటు చేసి బహిరంగ మార్కెట్‌లో నేరుగా అమ్ముకునే అవకాశం కల్పించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

Related Posts