పథకాల అమలుకు సహకరించడం లేదంటూ కృష్ణా జిల్లాల్లో బ్యాంకుల ముందు అధికారులు చెత్తబోయించిన వివాదం ముదురుతోంది. ఇప్పటికే రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వాల ముందుకు ఈ వివాదం చేరింది. కేంద్ర ఆర్థికశాఖ ఏం జరిగందన్న అంశాన్ని ఆరా తీసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరో ఒకటి, రెండు శాఖలు కూడా ఆ సంఘటనకు సంబంధించి వివరాలు సేకరించినట్లు తెలి సింది. దీంతో పథకాల అమలులో బ్యాంకర్ల పాత్ర, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన అంశాలపై అధికారవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. రిజర్వ్‌బ్యారకు మార్గదర్శకాలకు అనుగుణంగా తాము పనిచేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే కొన్ని పథకాల్లో తమ మాత్ర పరిమితంగానే ఉంటుందని బ్యాంకర్లు చెబుతున్నారు. పేదల కోసం ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలకు సహకరిరచాల్సిన బాధ్యత బ్యారకర్లపై ఉరటురదని ప్రభుత్వం వాదిస్తోంది. రిజర్వ్‌బ్యారకు మార్గదర్శకాల్లో కొన్ని రకాల పథకాలకు బ్యారకులు రుణాలు ఇవ్వాలని ఉరదని, ప్రభుత్వం గుర్తిర చిన లబ్దిదారులకు బ్యారకులు కొరత మొత్తాన్ని రుణంగా ఇవ్వాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు రిజర్వ్‌బ్యారకు మార్గదర్శకాల్లో లేవని, మానవతా కోణంలో మాత్రమే తాము సహకరిస్తున్నామని బ్యారకులు చెబుతున్నాయి. బ్యారకులు రిజర్వ్‌బ్యారకు ద్వారా కేంద్ర పరిధిలోకి వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. పైగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల కారణంగా పనిభారం కూడా విపరీతంగా పెరుగుతోందని, గ్రామీణ ప్రారతాల్లోని బ్యాంకుల్లో కొన్నిచోట్ల ఇద్దరు మాత్రమే ఉద్యోగులు ఉన్న పరిస్థితి ఉరదని, వారు దైనందిక లావాదేవీల్లోనే తలమునకలై ఉరటున్నారని, వారిపై పథకాల భారం మరిరత ఇబ్బందులు కలిగిస్తోరదని బ్యాంకర్లు అరటున్నారు.ఇక ప్రభుత్వ వాదన మరోలా ఉరది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశాల్లో చర్చ జరుగుతోందని, ఆ సమావేశాల్లోనే లక్ష్యాలను నిర్ధేశించుకుంటున్నారని, ఆ మేరకు అమలుకు సహకరించాలనే తాము కోరుతున్నామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే, సమావేశాల్లో అంగీకరిస్తున్న బ్యాంకర్లు ఆ తరువాత ముఖం చాటేస్తున్నారని, పదేపదే అడిగినా ఫలితం ఉండటం లేదని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఎల్‌బిసిలోగనీ, సబ్ కమిటీలో గానీ ఈ విషయాలపై పూర్తిస్థాయిలో చర్చించాలని ఇరు పక్షాలు నిర్ణయించినట్లు సమాచారం.