YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

వెలగపూడి విషయంలో రాంగ్ స్టెప్ పడిందా

వెలగపూడి విషయంలో రాంగ్ స్టెప్ పడిందా

విశాఖ సిటీలో ఆది నుంచి టీడీపీకి గట్టి బలం ఉంది. దీన్ని మరో విజయవాడగా చెప్పుకుంటారు. వ్యాపారం నిమిత్తం ఇక్కడకు వలస వచ్చిన కమ్మ సామాజికవర్గం నేతల డామినేషన్ అండర్ కరెంట్ గా రాజకీయాల మీద ఉంటుంది. దాంతో వారిని టచ్ చేయడం అంత ఈజీ కాదు, కానీ వైసీపీ బిగ్ రిస్కే చేసింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుని టార్గెట్ చేసింది. అయితే ఆ ఆపరేషన్ ఫెయిల్ అయి ఇపుడు వైసీపీ విలవిలలాడుతోది. పైగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అయింది.విశాఖకు వెలగపూడి రామకృష్ణ వలస వచ్చిన నాయకుడే. ఆయన లిక్కర్ వ్యాపారిగానే ముందు పరిచయం. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి మూడు సార్లు ఎదురులేని ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఆయన గతాన్ని తవ్వి వంగవీటి రంగా హత్య కేసులో ఏ 11 ముద్దాయి అని విశాఖ వాసులకు వైసీపీ గుర్తు చేస్తోంది. కానీ ఆయన గతం కంటే వర్తమానం ముఖ్యమనుకునే జనాలు ఎమ్మెల్యేను చేశారు. ఆయన కూడా బడుగు వర్గాల మన్ననలు అందుకుని వారి మద్దతుతోనే వరసగా గెలుస్తూ వస్తున్నారు. వెలగపూడి రామకృష్ణ ఒక విధంగా తూర్పు నియోజకవర్గంలో పాతుకుపోయారు. ఆయన్ని కదపడం అంటే కష్టమే. దాంతో ఆయన మీద చేసిన భూ ఆక్రమణల ఆరోపణలు బూమరాంగ్ అవుతున్నాయి. హత్యా రాజకీయాల మీద ఆరోపణలు కూడా ఇపుడు అనవసరం అని జనమే తేల్చేస్తున్నారు.విశాఖ సిటీలో టీడీపీ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో గట్టిగా నిలిచి వైసీపీకి తొడగొట్టి మరీ సవాల్ చేసిన నేతగా వెలగపూడి రామకృష్ణ ని చూస్తున్నారు. వైసీపీ దెబ్బకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వారు సైలెంట్ అయ్యారు. గణబాబు లాంటి స్థానిక బలం ఉన్న ఎమ్మెల్యేలు గప్ చిప్ అయ్యారు. కానీ వెలగపూడి మాత్రం బస్తీ మే సవాల్ అంటున్నారు. అంతే కాదు ఏకంగా విశాఖ వైసీపీకి పెద్ద దిక్కుగా, జగన్ తరువాత అంతటి నేతగా ఉన్న విజయసాయిరెడ్డినే సవాల్ చేయడాన్ని వైసీపీ నేతలు అసలు తట్టుకోలేకపోతున్నారు. వెలగపూడి రామకృష్ణ దారికి రాకపోగా గట్టిగా నిలబడడం తమ్ముళ్లకు కూడా బూస్టింగ్ ఇచ్చేదిగా ఉంది. దాంతో వైసీపీ ఆపరేషన్ వెలగపూడి రివర్స్ అయింది అంటున్నారు.ఇపుడు వెలగపూడి రామకృష్ణ విషయంలో దండోపాయం కాదని సామరస్యంగానే కధ నడపాలని వైసీపీ ఆలోచిస్తోందిట. ఆయన్ని చూసీ చూడనట్లుగా వదిలేయడం. ఆయన ఫుల్ సైలెంట్ గా ఉండడం. తద్వారా విశాఖ సిటీ రాజకీయాల్లో వైసీపీ దూకుడుకు అడ్డు లేకుండా చేసుకోవాలనుకుంటోందిట. కానీ ముందే సామరస్యంగా ట్రై చేసి ఉండాల్సింది. ఇపుడు సవాళ్ళ దాకా సీన్ వచ్చాక వెలగపూడి రాజీకి వస్తారు అన్నది ఉత్త మాటే అంటున్నారు. పైగా ఆయన చంద్రబాబుకు వీర విధేయుడు, నందమూరి కుటుంబానికి ఆప్తుడు, అటువంటి ఎమ్మెల్యే సైలెంట్ గా ఉండడం అసలు జరగదు అంటున్నారు. దాంతో విశాఖలో వైసీపీకి బ్రేకులేయడానికి ఒక్కడు చాలు అన్నట్లుగా వెలగపూడి రామకృష్ణ తయారయ్యారని అంటున్నారు. ఈ పరిణామాలతో పొలిటికల్ మైలేజ్ టీడీపీకి దక్కగా వైసీపీ రాంగ్ రూట్ పాలిటిక్స్ చేసిందన్న పేరు తెచ్చుకుంది.

Related Posts