YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

కెప్టెన్ దారెటు?

కెప్టెన్ దారెటు?

తమిళనాడులో రజనీకాంత్ తీసుకున్న నిర్ణయంతో అన్ని రాజకీయ పార్టీలు తమ పాత నిర్ణయాలపై పునరాలోచనలో పడ్డారు. ఇప్పటి వరకూ అన్నాడీఎంకే కూటమిలో ఉన్న పార్టీలు అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో ప్రధానంగా డీఎండీకే దాదాపు కూటమి నుంచి బయటకు వచ్చేసినట్లే. డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయిస్తున్నారు. బరిలో రజనీకాంత్ కూడా లేకపోతుండటంతో తనకు అవకాశముంటుందని కెప్టెన్ విజయ్ కాంత్ భావిస్తున్నారు.అందుకే రాష‌్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ ఛార్జులను ఇటీవల విజయ్ కాంత్ నియమించారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయ్ కాంత్ పార్టీ అన్నాడీఎంకే కూటమిలో ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ ఈ కూటమి నుంచే బరిలోకి దిగాలని తొలుత భావించింది. అయితే అన్నాడీఎంకే సీట్ల సర్దుబాటులో కొంత ఇబ్బందిని విజయ్ కాంత్ కు కలిగించింది. ఎక్కువ స్థానాలకు ఇవ్వకపోగా, అధికారంలోకి వచ్చినా కూటమిలోని పార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదని తేల్చి చెప్పింది.దీంతో విజయ్ కాంత్ తాను ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. రజనీకాంత్ రాజీకీయ పార్టీ పెట్టే ఆలోచన విరమించుకోవడంతో తాను సొంతంగానే బరిలోకి దిగాలని కెప్టెన్ భావిస్తున్నారు. జయలలిత, కరుణానిధి వంటి బలమైన నేతలు ఇప్పుడు లేకపోవడం, రజనీకాంత్ కూడా రాకపోతుండటంతో తన ఇమేజ్ తో అత్యధిక స్థానాలను గెలుచుకోవచ్చని విజయ్ కాంత్ అంచనా వేసుకుంటున్నారు.ఒంటరిగా బరిలోకి దిగడమా? లేక తానే తృతీయ కూటమిని ఏర్పాటు చేయడమా? అన్న దానిపై సీనియర్ నేతలతో విజయ్ కాంత్ చర్చలు జరుపుతున్నారు. తన నేతృత్వంలోనే తృతీయ కూటమిని ఏర్పాటు చేసి కమల్ హాసన్ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలను కూడా కలుపుకుని వెళ్లాలన్న యోచనలో కెప్టెన్ విజయ్ కాంత్ ఉన్నారంటున్నారు. మొత్తంమీద రజనీకాంత్ తాజా ప్రకటనతో అన్ని రాజకీయ పార్టీలు ఊపిరిపీల్చుకున్నాయి. ఎవరి లెక్కల్లో వారున్నారు.

Related Posts