YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్నాటక కాంగ్రెస్ లో ఇంటి పోరు

కర్నాటక కాంగ్రెస్ లో  ఇంటి పోరు

కర్ణాటక కాంగ్రెస్ లో ఇంటి పోరు పతాక స్థాయికి చేరుకుంది.  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 40 మందికి పైగానే సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వలేదు. వారితో పాటు గత కొన్నాళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారిని కూడా పక్కనపెట్టేసింది. దీంతో టిక్కెట్ ఆశించి దక్కని వారు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి తమకు టిక్కెట్లు ఇచ్చే పార్టీలు చేరిపోతున్నారు. మరికొందరు రెబల్స్ గా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.ఇందులో మాజీ ఎంపీ, సినీ నటుడు శశికుమార్ ఉన్నారు. ఆయన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. మొలకాల్మూరు నుంచి పోటీ చేయాలని శశికుమార్ భావించారు.అయితే హోసదుర్గ నియోజకవర్గం టిక్కెట్ శిశికుమార్ కు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీనికి మనస్తాపం చెందని శశికుమార్ దేవెగౌడ పార్టీ అయిన జనతాదళ్ (ఎస్)లో చేరిపోయారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తరికెరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాని టిక్కెట్ లభించక పోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.మరోవైపు మాజీ మంత్రి ఎం.ఎన్ నబి పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన గతంలో చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కూడ్లిగి నుంచి టిక్కెట్ ను ఆశించారు. కాని పార్టీ టిక్కెట్ కేటాయించలేదు. దీంతో నబి పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతోపాటుగా ఎమ్మెల్యే ఎస్.వై గోపాల కృష్ణ కూడా రాజీనామా బాట పట్టారు. స్పీకర్ కూ తన రాజీనామా లేఖను పంపారు. బళ్లారి రూరల్, మొలకాల్మూర్ స్థానాల్లో ఒకటి తనకు కేటాయించాలని గోపాల కృష్ణ కోరారు. కాని కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ కేటాయించలేదు. అయితే ఈయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయిపోయారు. దీంతో ఆయన యడ్యూరప్ప సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గోపాలకృష్ణకు కూడ్లిగి టిక్కెట్ కేటాయిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇలా టిక్కెట్లు దక్కని వారు వెంటనే పార్టీ కండువాలను మార్చేస్తుండటం కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. మొత్తం మీద టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… ఇటు రెబల్స్, అటు పార్టీలు మారుతున్న నేతలతో కాంగ్రెస్ లో ఆందోళన మొదలయింది.

Related Posts