YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సీపీఎం సమావేశాల్లో భిన్న తీర్మానాలు

సీపీఎం సమావేశాల్లో భిన్న తీర్మానాలు

హైద్రాబాద్‌లో జరుగుతున్న సీపీఎం జాతీయ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. రెండు భిన్న రాజకీయ ముసాయిదా తీర్మానాల మధ్య మేధో సంఘర్షణ జరుగుతోంది. కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన వుండలా వద్ద అన్న అంశంపై కారత్, ఏచూరి వర్గాలుగా పార్టీ నేతలు చీలిపోయారు.సీపీఎం జాతీయ మహా సభలు ఎన్నడూ లేనంత సంఘర్షను ఎదుర్కొంటున్నాయి. గతానికి భిన్నంగా ఈ దఫా రెండు రాజకీయ ముసాయిదా తీర్మానాలను సభ చర్చిస్తోంది. కాంగ్రెస్ తో ఎలాంటి అవగాహన పెట్టుకోకుండా బీజేపీ ని గద్దె దించేందుకు పార్టీ పనిచేయాలన్న కేంద్ర కమిటీ తీర్మాణాన్ని మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రవేశ పెట్టారు. అయితే బీజేపేని ఓడించేందుకు కలిసి వచ్చే ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో కలిసి ఐక్య పోరాటాలు చేయాలన్న రాజకీయ ముసాయిదా తీర్మాణాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ప్రవేశ పెట్టారు. ఈ రెండు ప్రతినిధులపై చర్చ బుధ, గురువారాలు చర్చించి తుది ముసాయిదా రూపొందిస్తామని ఏచూరి ప్రకటించారు. పార్టీలో ఏలాంటి విభేదాలు లేవని...రాజకీయ పంథాపై భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని..చర్చల అనంతరం ఏకాభిప్రాయానికి వస్తామన్నారు. బీజేపీ ఓటమే లక్షంగా పనిచేస్తామన్నారు. అయితే కాంగ్రెస్ తో పొత్తుల విషయంలో పార్టీలో బిన్నాభిప్రాయాలు తీవ్ర స్థాయిలో ఉన్న నేపధ్యంలో కారత్, సీతారం ఏచూరి వర్గాల మద్య సయోద్య కుదిర్చే ప్రక్రియ మోదలైంది. కాంగ్రెస్ తో అవగాహనను కేవలం ఉద్యమాల వరకే పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ఇరు వర్గాలు అంగీకరించే అవకాశం ఉంది. కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తులు కాకుండా ఉద్యమాల పొత్తులే ఉంటాయని మహసభలు తీర్మాణించే చాన్స్ ఉంది. దీంతో పాటు పార్టీ, అనుబంధ సంఘాలు గత మూడు సంవత్సరాలుగా చేసిన పోరాటాలు, పొరపాట్లు, నెర్చుకున్న గుణపాఠాలను సమీక్షించి పార్టీ బలోపేతం కోసం మహసభలు దిశా నిర్దేశం చేయనున్నాయి. జస్టిస్ లోయా అనుమానస్పద మరణం పై  సుప్రీం కోర్టు విచారణ నిరాకరించడం పట్ల సీపీఎం మహసభలు అసంత్రుప్తి వ్యక్తం చేసాయి. జస్టిస్ మ్రతిపై  ఎన్నో అనుమానాలు ఉన్నందున నిజానిజాల పరిశీలనకు సుప్రీం కోర్టు లార్జర్ బెంచ్ తో విచారణ చేపట్టాలని విజ్నప్తి చేసాయి.ఆదివారం నాడు బహిరంగ సభతో ముగుస్తుంది. రాజకీయ ముసాయిదాపై బిన్నాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో సీతారం ఏచూరినే మరో సారి ప్రదాన కార్యదర్శిగా ఎన్నుకుంటారా లేక మరోక్కిరికి ఆ భాద్యత కట్టబెడాతరన్నదే ఉత్కంఠగా మారింది. 

Related Posts