మోత్కూర్ లో సైబర్ నేరం జరిగింది. సైబర్ నేరగాళ్లు ఓ వ్యాపారికి ఫోన్ చేసి మీకు ఫోనోపి, గూగుల్ పే ఉందా అం టూ మాటల్లో పెట్టి అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ.19.858 స్వాహా చేశారు. ఈ సంఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో మహదేవ్ బట్టల దుకాణం వ్యాపారి చేతన్ కుమార్ కు మంగళవారం 73188 24947, 73191 26101 నంబర్ల నుం చి ఫోన్లు వచ్చాయి. అతను ఫోన్లను ఎత్తగా ఢిల్లీ నుం చి ఫోన్ చేస్తున్నామని, మీకు ఫోన్ పే, గూగుల్ పే ఉం దా అంటూ అడిగి ఫోన్ పెట్టేశారు. అతను తన బ్యాంక్ ఖాతా వివరాలు గానీ, ఓటీపీ గానీ చెప్పలేదు. ఫోన్ పెట్టేసిన వెంటనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు చెందిన అతని అకౌంట్ నుంచి విడతలవారీగా వరుసగా రూ.5430, 2,000, 1,000, 999, 5.430, 2,000, 999, 2,000 కట్ అయ్యా యి. అతని ఫోన్కు అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నట్టు మెసేజ్ లు వస్తుండ డంతో ఖంగుతిన్నాడు. అతను బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోగా అకౌంట్ లో రూ.19,893 ఉం డాల్సి ఉండగా రూ.19858 కట్ అయి రూ.35 మాత్రమే మిగిలి ఉండటంతో లబోదిబోమన్నాడు.