ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామితో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, పలువురు న్యాయమూర్తులు, పలువురు రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈశాన్య రాష్ట్రం అసోం లో జన్మించిన గోస్వామి గువాహతి యూనివర్సిటీ కాటన్ కాలేజీనుంచి ఆర్ధిక శాస్త్రంలో పట్టా పొందారు. న్యాయ శాస్త్రం చదివిన తరువాత న్యాయవాది గా ప్రాక్టీస్ ప్రారంభించారు. పలు సంస్థలకు న్యాయవాదిగా పనిచేసారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, సర్వీస్ అంశాలలో అయన నిష్ణాతులు. 2011 లో గువహతి హైకోర్టులో అయన అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తరువాత నాగాల్యాండ్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ ఆధారిటీకి అధ్యక్షుడిగా పనిచేసారు. జస్టిస్ గోస్వామి అసోం తరుపున రంజి ట్రోఫిలో పాల్గోన్నారు. ఏపీకి రాకముందు అయన సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాపనిచేసారు