మహిళా ఏఎస్పీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో కలిసి సీఐ ఇంట్లో ఉండగా భర్త, తల్లి దండ్రులు పట్టుకుని చెప్పులతో కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్ తీసుకున్న ఉన్నతాధికారిలు కల్వకుర్తి సీఐ మల్లిఖార్జున రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏఎస్పీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం సీఐపై వేటు వేశారు. రాసలీలల వ్యవహారంలో విచారణ జరిపి మల్లికార్జున్‌రెడ్డిపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర వేటు వేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా.. ఈ సస్పెన్షన్‌కు ముందు మహిళా అధికారి ఏఎస్పీ స్టేట్ మెంట్‌ను కూడా కేపీహెచ్బీ పోలీసులు రికార్డు చేశారు. ఆమె తన ఇష్టపూర్వకంగానే సీఐతో ఉన్నట్టు తెలియజేసిందని పోలీసు వర్గాల సమాచారం. సీఐ మల్లికార్జున్‌రెడ్డి, మహిళా అధికారి వేర్వేరుగా విడాకులకు అప్లయ్ చేశామని, త్వరలోనే తామిద్దరం వివాహం చేసుకుంటామని సన్నిహితులతో సీఐ మల్లికార్జున్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారం ఎంతటిదాకా వెళుతుందో వేచి చూడాల్సిందే.