YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

వ్యవసాయ చట్టాలపై దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు సంసిద్ధత

వ్యవసాయ చట్టాలపై దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు సంసిద్ధత

న్యూఢిల్లీ జనవరి 6 
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను విచారించచేందుకు సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది. రైతుల గందరగోళంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం అన్ని పిటిషన్లను ఒకే ధర్మాసనానికి బదిలీ చేసి విచారణ చేపట్టనున్నది. వ్యవసాయ చట్టాలకు చట్టపరమైన సవాలుతోపాటు పెండింగ్‌లో ఉన్న అన్ని రైతు ఆందోళనలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విషయాలను జనవరి 8 న తీసుకుంటామని ధర్మాసనం పేర్కొన్నది. అయితే దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో రౌండ్ చర్చలు శుక్రవారం జరుగనున్నందున.. సమీప భవిష్యత్‌లో ఇరు పార్టీలు కొంత నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నదని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలియజేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ అన్ని పిటిషన్లతో పాటు రైతుల ఆందోళనకు సంబంధించిన పిటిషన్లను కూడా జనవరి 11న విచారిస్తామని సుప్రీంకోర్టుల తెలిపింది. రైతుల నిరసనకు సంబంధించి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బొబ్డె, ఏఎస్‌ బొపన్న, వీ రామసుబ్రహ్మణ్యంలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. రైతుల ఆందోళన, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను సోమవారం విచారిస్తామని ధర్మాసనం పేర్కొన్నది. మూడు వ్యవసాయ చట్టాల రాజ్యాంగ ప్రామాణికతను సవాలు చేస్తూ న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎస్సీ పరిశీలించింది. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో వ్యవసాయాన్ని చేర్చిన 1954 రాజ్యాంగ సవరణ చట్టం సరైన రీతిలో ఆమోదించలేదని న్యాయవాది ఎంఎల్ శర్మ తన పిటిషన్‌లో ఆరోపించారు. వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని శర్మ వాదించారు.

Related Posts