YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అన్నీ ఉన్నా నెల్లూరు నోట్ల శనే

అన్నీ ఉన్నా నెల్లూరు నోట్ల శనే

మందీ ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది అనేది సామేత.లీడర్లు ఎక్కువైతే పోలిటికల్ పార్టీలో పని చేసే వారు తగ్గిపోతారనేది లేటేస్ట్ రాజకీయ సామేత.ఈ సామేత నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సరిగ్గ సరిపోతుంది.హేమహేమీలు,తరతరల రాజకీయ వారసత్వం,మంత్రులు,మాజీ మంత్రులు,బడా కోటీశ్వరులు,పారిశ్రామికవేత్తలు నెల్లూరులో సైకిల్ పార్టీలో ఉన్నారు.అయిన పది అసెంబ్లి,రెండు పార్లమెంట్ స్దానల్లో సగం కూడ గెలవలేని దీన స్దితి టిడిపి ది.దీనికి ప్రధాన కారణం ఐక్యత లేకపోవడం.ఎంతో కోంత కలిసి పని చేస్తే ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగిపోవడం ఖాయం అని తెలిసి అసూయ ద్వేషలతో,ఫాల్స్ ప్రిస్టేజ్ లతో టిడిపి పెద్దలు ఉమ్మడిగ,ఐక్యంగ వ్యవహరించలేకపోతున్నారని పార్టీ కార్యకర్తలు మధనపడుతున్నారు.

 

మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రులు అదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణారెడ్డి, మాజీ ఎఎమ్మెల్యేలు కంభం విజయరామిరెడ్డి, రమేష్ రెడ్డి, ముంగమూరు శ్రీధరక్రిష్ణరెడ్డి ఇది నెల్లూరులో టిడిపి రెడ్డి బలగం.ఎమ్మ్యేల్ల్యేలు బోల్లినేని రామారావు,కురుగోండ్ల రామక్రిష్ణ,పారిశ్రామికవేత్త గంగప్రసాద్ లాంటి హేమహేమీలు కమ్మ వర్గనికి అండగ ఉన్నారు. కాపు,బలహీనవర్గల తరపున మంత్రి నారాయణా,ఎమ్మ్యేల్ల్సీ బీద రవిచంద్రయాదవ్, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు లాంటి వారు నాయకత్వం వహిస్తున్నారు. ఎస్సీల నుంచి మాజీ మంత్రులు పరసా రత్నం, బల్లి దుర్గాప్రసాద్ రావు, ఎమ్మెల్యే పాశం సునీల్ కూమార్, నెలవల సుబ్రహమణ్యంలు నాయకులుగా ఉన్నారు. మైనారీల నుంచి నెల్లూరు మేయర్ అజీజ్ నాయకుడుగా ఉన్నారు.ఇలా అగ్రవర్ణాలు, బి.సిలు, ఎస్.సిలు, ముస్లింలలో టిడిపికి నెల్లూరులో ఎదురేలేదు. వచ్చిన సమస్యంతా ఇంత మంది లీడర్లలో సఖ్యత లేదు. కలిసి పని చేస్తామన్న ఆలోచన లేదని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే రెండు రెట్లు అధికంగ లీడర్లు టిడిపికి ఉన్నా వైసిపి క్యాడర్ కంటే పది రెట్లు కష్టపడి పనిచేసే కార్యకర్తలు సైకిల్ కు అండగా ఉన్న వారిని సమిష్టిగా నడిపించే లీడర్లు నెల్లూరు తెలుగుదేశంలో కోరవడ్డారు. రెడ్డి, కమ్మ, కాపు, బిసి,ఎస్.సిలలో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని,క్యాడర్ బలాన్ని వైసిపి వాస్తవంగా అయితే ఎదుర్కోలేని బలహీన స్దితిలో ఉంది. రెడ్డి కులాభిమానంతో జగన్ పార్టీకి కోంత నెల్లూరులో కలిసోచ్చినా అసలు టిడిపి ప్రధానంగా ఫెయిల్ కావడనికి కారణం మాత్రం నాయకుల మధ్య ఐక్యత లేకపోవడమే. అధిపత్య పోరు, వెన్నుపోట్లు, పరోక్షంగా వైసిపికి సహకరించడం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. పది మంది లీడర్లు ఎమ్మెల్యేలు అయిపోవాలని కలలు కనడం, టిక్కెట్ రాకపోతే వెన్నుపోటు పొడవడమే వైసీపీ లీడర్లను ఇక్కడ గెలిపిస్తుంది. సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి గెలవకూడదని జిల్లా ముఖ్య టిడిపి లీడర్లు తపస్సు చేస్తుంటారు. కావలిలో బీద బ్రదర్స్ దెబ్బతినాలని సైకిల్ పార్టీ పెద్దలు కుట్రలు చేస్తుంటారు. అత్మకూరులో ఆనం అపజయం కోసం సోంత పార్టీ లీడర్లే డైరెక్ట్ గా కృషి చేస్తుంటారు. ఈ నేపధ్యంలో అసలు ఆనం టిడిపి ను వీడుతున్నడని జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతుంది. మేయర్ అజీజ్ కు చెడ్డపేరు తెవాలని టిడిపి కార్పోరేటర్లు బాగ కష్టపడుతుంటారు.అభివృధ్ది వేరు, రాజకీయం వేరు,క్యాడర్ ను దగ్గరకు తీస్తేనే ఓట్లు వారు ఓట్లు వేయిస్తారనే సత్యం చెప్పిన మేధావితనం చేత తలకెక్కించుకోరు పనిరాక్షస మంత్రి నారాయణా. ఉదయగిరిలో బోల్లినేని వెస్ట్ అంటు సోంత కమ్మ కులస్దులు,రెడ్డి బ్యాచ్ మైక్ సెట్ లు పెట్టి మౌత్ పబ్లిసిటి చేస్తుంటారు.ఎస్.సి నియోజకవర్గల్లో ఎస్.సి లీడర్లే ఒకరి వెనుక మరోకరు గోతులు తీసుకోంటు ఉంటారు.నెల్లూరు టిడిపి లీడర్లను అంత ఐక్యంగా నడపాలంటే అషామాషి పని కాదు. చంద్రబాబు, లోకేష్ లు ప్రత్యేక ధృష్టి పెట్టి కలసి ఉంటే కలదు సుఖం, ఐక్యంగా పోరాడి గెలవండి తరువాత తీరిగ్గా వర్గ పోరు పెట్టుకొంటాం అని జ్ఞానోపదేశం చేస్తే తప్ప నెల్లూరులో పసుపు జెండా ఎగరదని క్యాడర్ తేల్చి చెబుతుంది.

Related Posts