YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

61 అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు... మంత్రి కొడాలి నాని

61 అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు...   మంత్రి కొడాలి నాని

విజయవాడ జనవరి 6 
అధికారం కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మంత్రి కొడాలి నాని విమర్శించారు.  'కులాలు, మతాలు గురించి మాట్లాడటం బాబు దిగజారుడు తనానికి నిదర్శనం. వాడుకోవడం, వదిలివేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.'అని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.'ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీలపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణం. అధికారులు మతాల వారీగా పనిచేయరు.  అన్ని వర్గాల ఆదరణతోనే సీఎం జగన్‌ ఈ స్థాయిలో ఉన్నారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి మిడతలాంటి లోకేశ్‌ మాట్లాడటం విడ్డూరం..జగన్‌ అంటే ఒక వ్యవస్థ. సంక్షేమ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు.  ప్రజలే చంద్రబాబును భూస్థాపితం చేస్తారని' నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Related Posts