YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చిలికా సరస్సుకు వచ్చిన 12 లక్షలకు పైగా వలస పక్షులు.

చిలికా సరస్సుకు వచ్చిన 12 లక్షలకు పైగా వలస పక్షులు.

భువ‌నేశ్వ‌ర్‌ జనవరి 6 
 ఒడిశాలోని చిలికా స‌ర‌స్సుకు ఈ ఏడాది అత్య‌ధిక స్థాయిలో వ‌ల‌స ప‌క్షులు వ‌చ్చాయి.  సుమారు 12 ల‌క్ష‌ల‌కు పైగా వ‌ల‌స ప‌క్షులు వ‌చ్చిన‌ట్లు అధికారులు చెప్పారు.  గ‌త రెండు ద‌శాబ్ధాల్లో ఈ రికార్డు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి అని అధికారులు పేర్కొన్నారు.  రామ్‌సార్ క‌న్వెన్ష‌న్, యునెస్కో వార‌స‌త్వ సంప‌ద‌గా .. చిలికా స‌ర‌స్సుకు గుర్తింపు ఉన్న‌ది.  ప్ర‌తి ఏడాది నిర్వ‌హించే వ‌ల‌స ప‌క్షుల వార్షిక లెక్క‌ల నివేదిక‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ఈ ఏడాది 12,04,351 వ‌ల‌స ప‌క్షులు వ‌చ్చిన‌ట్లు నివేదిక‌లో వెల్ల‌డించారు. వీటిల్లో సుమారు  111 జాతుల ప‌క్షులు ఉన్న‌ట్లు గుర్తించారు. 2019లో చిలికా స‌ర‌స్సుకు సుమారు 10.70 ల‌క్ష‌ల వ‌ల‌స ప‌క్షులు వ‌చ్చాయి.  ఈ ఏడాది చిలికా స‌ర‌స్సుకు వ‌చ్చిన ప‌క్షుల్లో 38,475 ప‌క్ష‌లు మాత్రం స్థానిక ప్రాంతాల నుంచి వ‌చ్చిన‌ట్లు తేల్చారు.  మొత్తంమీద ఈ ఏడాది చిలికా స‌ర‌స్సుకు సుమారు 1.35 ల‌క్ష‌ల వ‌ల‌స ప‌క్షుల సంఖ్య పెరిగిన‌ట్లు డివిజిన‌ల్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ కేదార్ కుమార్ స్వెయిన్ తెలిపారు.

Related Posts