YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీయం

చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీయం

దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  బుధవారం ఉదయం 11:45 గంటల నిమిషాల సమయంలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో  అవుకు గ్రామానికి బయలుదేరి అవుకు గ్రామ శివారులో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్ లో మధ్యాహ్నం చేరుకున్నారు.
ముఖ్యమంత్రి అక్కడి నుంచి రోడ్డు మార్గాన హై స్కూల్ మీదుగా మార్కెట్ విధి, బస్టాండ్ మీదుగా నేరుగా  చల్లా రామకృష్ణారెడ్డి స్వగృహానికి రోడ్డు మార్గాన  చేరుకున్నారు.
అవుకు గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి రహదారి వెంబడి ఉన్న ప్రజలు అభివాదం చేశారు.
అవుకు గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రావడంతో చుట్టుపక్కల మండలాల గ్రామాల నుంచి  పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సీఎంను చూసేందుకు ఉత్సాహం చూపారు.
ఈ సందర్భంగా దారి పొడవునా ప్రజలు బారులు తీరి సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిలకించారు.
ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ, నమస్కరిస్తూ ముందుకు సాగటం తో ప్రజలు కూడా ప్రతిగా నమస్కరించి ఆనందం వ్యక్తం చేశారు. మార్గమధ్యంలో ప్రజలు బారులు తీరి సీఎం గారికి అభివాదము తెలిపారు.
తొలుత దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.  చల్లా రామకృష్ణారెడ్డి సతీమణి చల్లా శ్రీదేవి, కుమారుడు చల్లా భగీరథ రెడ్డి, సోదరలు చల్లా రామేశ్వర రెడ్డి, చల్లా రఘునాద్ రెడ్డి, చల్లా ప్రభాకర్ రెడ్డి, అల్లులు పోతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డి. రవీంద్రనాథ్ రెడ్డితో పాటు కూతురులు,  కోడళ్ళు, మనవళ్ళు, తన కుటుంబ సభ్యులు 25 మందిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
అందులో భాగంగా చల్ల భగీరథ రెడ్డి తన కుటుంబ సభ్యులను, బంధువులను సీఎంకు పరిచయం చేశారు.
పరామర్శ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బిజేంద్ర నాథ్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, తోగూర్ ఆర్థర్, కాటసాని రామిరెడ్డి పాటు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె.పక్కిరప్ప, జె సి రామ్ సుందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం తిరిగి  అవుకు హెలిప్యాడ్ కు చేరుకొని అక్కడ నుంచి హెలికాప్టర్లో ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కి బయలుదేరారు.

Related Posts