YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజల పై భారం మోపే చీకటి చట్టాలను వెంటనే రద్దు చేయాలి - పౌర సమాఖ్య

ప్రజల పై భారం మోపే చీకటి చట్టాలను వెంటనే రద్దు చేయాలి - పౌర సమాఖ్య

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన చీకటి చట్టాల వలన ప్రజలపై భారం పడుతుంది అని,వీటిని వెంటనే రద్దు చేయాలని  పౌర సమాఖ్య నాయకులు అన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర వద్ద ఆస్తి పన్నుల పెంపు పై  పౌర సమాఖ్య, అనుబంధ సంఘాలు ధర్నా నిర్వహించి, వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా పౌర సమాఖ్య నాయకుడు మాదాల వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పన్నుల పెంపుపై అన్ని జిల్లా,మండలాల్లో నగర పంచాయతీ,మునిసిపాలిటీ,పట్టణ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా నిర్వహించామని అన్నారు.  ఇంటి పన్నులను ఆస్తి విలువ ఆధారంగా పెంచేందుకు కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు నిర్ణయించడం వల్ల ప్రజల అధోగతి పాలవుతున్నారు అని అన్నారు. ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంచడంతో పాటు నీటి పన్నులు,డ్రైనేజ్ చార్జీలు పెంచడం,చెత్త పై కొత్తగా పన్నులు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవించడం దుర్మార్గపు చర్య అని అన్నారు.ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇలా ప్రజలపై మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అనే రీతిలో వ్యవహరిస్తున్నాయని అన్నారు.రానున్న ఏప్రిల్ నెల నుండి పన్నుల మోత అమలులోకి రానున్న నేపథ్యంలో కోటి అరవై లక్షల మంది ప్రజలపై పది వేల కోట్ల రూపాయల భారం పడనుంది అని తెలిపారు.73,74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక ప్రభుత్వాలకు పన్నులు నిర్ణయించే అధికారం ఉందని,కానీ రాష్ట్రం లో స్థానిక ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన సభ్యులు పన్నులు నిర్ణయించాలని పేర్కొన్నారు.ఒక వైపు కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు కార్పోరేట్ పన్నులలో రాయితీలు ఇస్తూ పట్టణ ప్రజలపై పన్నుల భారం మోపుతోంది అని ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో ఈ విధంగా పన్నులు పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజానీకం అవస్థలు ఎదుర్కుంటారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై మొండి వైఖరి అవలంబిస్తునదని అన్నారు.
పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలపై భారాలు మోపే చట్టాలను ప్రభుత్వం తీసుకొని వచ్చింది అని అన్నారు.దీని వల్ల ఇంటి యజమానులు ఇంటి అద్దెలు అధికంగా పెంచే అవకాశం ఉందని వలస వెళ్ళే అవకాశం ఉందని అన్నారు.ఇకనైనా ప్రభుత్వ ప్రజల సంక్షేమానికే అడ్డుకునే చట్టాలను వెంటనే వెనుకకు తీసుకోవాలని,అలా కాని పక్షంలో ప్రజలతో మమేకమై ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు.

Related Posts