YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేశినేని... దారి తప్పుతారా...తప్పిస్తారా

కేశినేని... దారి తప్పుతారా...తప్పిస్తారా

తెలుగుదేశం పార్టీలో గత ఎన్నికల్లో గెలిచింది ముగ్గురు ఎంపీలే. అందులో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిచిన రామ్మోహన్ నాయుడు పార్టీకి లాయల్ గానూ, యాక్టివ్ గానూ ఉంటున్నారు. ఇక గుంటూరు నుంచి గెలిచిన గల్లా జయదేవ్ మాత్రం విజిటింగ్ ఎంపీగానే మిగిలిపోయారు. పార్లమెంటు సమావేశాల సమయంలో తప్ప ఆయన ఎప్పుడూ కన్పించరన్న కామెంట్స్ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. ఇక విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశినేని నాని మాత్రం పార్టీ కంటే తన సొంత ఇమేజ్ ను పెంచుకునేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.కేశినేని నానిని తొలి నుంచి టీడీపీ దూరంగా పెడుతుంది. ఆయన భవనంలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని షిఫ్ట్ చేయడం ద్వారా అధిష్టానం తొలి ఝలక్ కేశినేని నానికి ఇచ్చింది. పార్టీ పదవుల విషయంలోనూ కేశినేని నానికి న్యాయం జరగలేదు. కేశినేని నానికి టీడీపీలో ఒక వర్గమంటూ ఏదీ లేదు. ఆయన సొంతంగానే నేతగా బలపడాలనుకున్న పరిస్థితుల్లో టీడీపీ నేతలు కూడా ఆయనకు దూరమయ్యారనే చెప్పాలి. దేవినేని ఉమకు చంద్రబాబు పదవి ఇవ్వడంతో కేశినేని నాని మరింత అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవినేని ఉమకు, కేశినేని నానికి తొలి నుంచి పడదు. ఆయనకు పార్టీల ప్రాధాన్యత ఇవ్వడంపై కేశినేని నాని గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తోటి ఎంపీలు ఇద్దరికీ పదవులు ఇచ్చిన చంద్రబాబు తనకు ఏ పదవి ఇవ్వకపోడంపై ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్న కేశినేని నాని దేవినేని ఉమకు పదవి ఇవ్వడంతో మరింత ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.పార్టీ కార్యక్రమాల్లో కూడా కేశినేని నాని పెద్దగా పాల్గొనడం లేదు. కానీ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం మాట్లాడుతున్నారు. టీడీపీలో తన పరిస్థితిని గుర్తించిన కేశినేని నాని బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. తనను కావాలనే టీడీపీలోని కొందరు చంద్రబాబుకు దూరం చేశారన్నది కేశినేని వాదన. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో తన ముఖ్యమైన అనుచరులతో సమావేశం అవుతారని తెలుస్తోంది. ఈ సమావేశంలో కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకునే

Related Posts