ఇద్దరు మినిస్టర్ లు సీఎంకు తలనొప్పిగా మారారట. సీఎం జగన్ కూడా అనలేక.. అనకుండా ఉండలేక ఇబ్బంది పడుతున్నారట. అసలు.. వంద మెట్లెక్కినా.. ఒక్కసారి కాలు జారితే అక్కడ్నుంచీ పడిపోవడం ఖాయం. తప్పదు. అలా నడిస్తే అంతే ఉంటుంది. పాలిటిక్స్ లో కూడా అంతే. బర్ర బర్ర ఎదిగొచ్చిన లీడర్ కొడాలి నాని. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరుంది. దానికి తగ్గట్లు దూకుడు కూడా ఎక్కువే. తక్కువ వయసులోనే అంత స్థాయికి చేరారు అనే రెస్పెక్ట్ కూడా ఎక్కువే. కానీ.. ఏం చేస్తారు. సార్ కి కాస్త టంగు స్లిప్ ఎక్కవ సార్లు అవుతుంటుంది. ఒక్కోసారి ఆవేశంలో ఎంత దాకా అయినా వెళ్తుంటారు. అదే నానికి ప్రాబ్లమ్ తెచ్చిపెట్టింది. మొన్న పేకాట క్లబ్బుల ఎవ్వారం ఇంతే జరిగింది. పవన్ కల్యాణ్ గుడివాడ పేకాట క్లబ్బులపై కామెంట్స్ చేస్తే.. అసలు పేకాట క్లబ్బులే లేవన్నారు. తక్కువ గ్యాప్ లోనే పేకాట క్లబ్బులపై దాడులు జరిగాయి. పట్టేసుకున్నారు. దీంతో.. సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లైంది నాని పరిస్థితి. పైగా.. పేకాట ఆడితే ఉరిశిక్ష వేస్తారా.. అదేమైనా పెద్ద ఇదా అంటూ.. మినిస్టర్ హోదాని మరిచి మాట్లాడారు. దీంతో.. నువ్వేం మినిస్టర్ వి సారూ అంటున్నారు జనాలు. ఇక ప్రతిపక్షాలు ఊరుకుంటాయా.. ఆడేసుకుంటున్నాయి. కొడాలి నాని అంటే.. సీఎం జగన్ పై ఈగ వాలినా.. తాట తీస్తా అనే టైప్. కానీ.. ఇప్పుడు ఆయన్నే ఇబ్బందుల్లో పడేశారు.ఇక వెల్లంపల్లి శ్రీనివాస్ పరిస్థితి కూడా అదే. అశోక్ గజపతి రాజు ఇష్యూలో నానా మాటలు పడుతున్నారు. మామూలుగా టీడీపీ లీడర్ అశోక్ గజపతి రాజుకి ఓ రెస్పెక్ట్ ఉంది. ప్రత్యర్థులు కూడా ఆయనపై చీప్ లాంగ్వేజ్ తో కామెంట్స్ చేయరు. కానీ.. వెల్లంపల్లి ఏమో.. కాస్త డోస్ పెంచి మరీ మాట్లాడారు. దీంతో.. టీడీపీతో పాటు.. ఆయన వర్గం తరపున కూడా భారీ నెగిటివిటీ వచ్చింది. ఇక వైసీపీలో కూడా చాలామంది వెల్లంపల్లినే అంటున్నారట. గజపతిరాజు విషయంలో అలాంటి కామెంట్స్ చేయకుండా ఉండాల్సింది అంటున్నారట. మినిస్టర్ అయి ఉండి.. హోదా మర్చిపోయి మాట్లాడుతున్నారు అని.. సొంత పార్టీ లీడర్లే.. తలంటి పోస్తున్నారట.