రామతీర్థం ఘటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ ఘటనపై విమర్శల దాడి జరుగుతుంది. కాడా బీజేపీ-జనసేన సంయుక్తంగా చేపట్టిన ధర్మయాత్రను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మరోసారి 'చలో రామతీర్థం' కు పిలుపునిచ్చింది బీజేపీ. ఎట్టి పరిస్థితిల్లోనూ రామతీర్థం ఆలయాన్ని నేడు సందర్శించే తీరుతామని తేల్చిచెప్పారు బీజేపీ నేతలు. ఈ క్రమంలో రామతీర్థం పరిసర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ర్యాలీలు, ఆందోళనలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. దీంతో రామతీర్థం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో మరోసారి హై టెన్షన్ నెలకుంది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.