రాష్ట్రంలో మెజారిటీ హిందువుల మనోభావాలకు అను గుణంగా బీజేపీ పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదని, మిగిలిన పార్టీల్లా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడబోమన్నారు. తాము మౌనంగా ఉంటామని ప్రభుత్వం భావిస్తోందని, కానీ అది జరిగే పని కాదన్నారు. రాష్ట్రంలో చర్చిలు, దర్గాలు కట్టిస్తామంటున్న వైసీపీ మతతత్వ వాద పార్టీ కాదు కానీ, హిందువుల గురించి మాట్లాడితే తాము మతతత్వ వాదులమా అని సోము వీర్రాజు ప్రభు త్వాన్ని ప్రశ్నించారు.మళ్ళీ రామతీర్ధా నికి వెళ్తున్నామని,ప్రభుత్వమే ఇందుకు ఏర్పాట్లు చేయాలని సోము డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ నేతలకు ఇచ్చినట్లే అన్ని ప్రోటోకాల్ మర్యాదలూ కల్పించాలని కోరారు. విజయవాడలో వైఎస్ విగ్రహానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవతా విగ్రహాలకు ఇవ్వలేదని సోము మండిపడ్డారు. శ్రీశైలం ఆలయాన్ని ఇప్పటికీ అన్య తస్థులు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు.