అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అశోకా పిల్లర్ పాక్షికంగా ధ్వంసం అయింది. బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని అనుమానిస్తున్నారు. అయితే, ఎవరైనా ఆకతాయిలు చేసిందా అనేది పోలీసులు విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ చేసి ఎంతో పురాతన చరిత్ర కలిగినటువంటి అశోక్ పిల్లర్ని మరమ్మతులు చేసి కాపాడాల్సిందిగా కోరారు. 1951 సంవత్సరంలో స్వర్గీయ నీలం సంజీవ రెడ్డి ఈ పిల్లర్ ను ప్రారంభించారు. అశోక్ పిల్లర్ ను నాటి మద్రాస్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బెజవాడ గోపాల రెడ్డి విద్యుత్ దీపాలను స్విచ్ వేసి ఆరంభించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పిల్లర్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభాకర్ రెడ్డి కోరారు.