ఆంధ్రప్రదేశ్ విజయ నగరం జిల్లా రామతీర్థం ఘటనపై రాజకీయ రగడ కొనసాగుతోంది. రామతీర్థం రాముడ్ని దర్శించుకునే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఛలో రామతీర్థాన్ని భగ్నం చేశారు. ఈనేపథ్యంలో రామ తీర్థం వెళ్లి తీరతామన్న బీజేపీ నేతలు మరోసారి ఛలో రామతీర్థానికి పిలుపునిచ్చారు. మూడు రోజులుగా విశాఖపట్నంలోనే మకాం వేసిన బీజేపీ నేతలు.., గురువారం విశాఖ నుంచి రామతీర్థం బయలు దేరారు. విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్లే దారిలో ప్రధాన కూడళ్లలో భారీగా మోహరించిన పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అడ్డుకున్నా రు.సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు బీజేపీ నేతలను హెచ్చరిస్తున్నారు.ఈ క్రమంలో విశాఖలో ఆందోళన వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
బీజేపీ చలో రామతీర్ధాలు ధర్మయాత్ర నేపథ్యంలో విశాఖలో మళ్ళీ ఉదృతంగా మారింది.ఛలో రామతీర్థం నేపథ్యంలో విశాఖలో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారూ. మాజీ ఎమ్యెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు,జిల్లా బీజేపీ నేతలను పోలీసులు కట్టడి చేశారు. విశాఖ నుంచి రామతీర్ధాలకు వెళ్లే దారులన్నీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని, రామతీర్ధాలకు వెళ్లకుండా ప్రభుత్వం ఎన్ని సారులు అడ్డుకున్న హిందువుల మనోభావాలు కాపాడేందుకు బీజేపీ రామతీర్థం వెళ్లితిరుతుందిని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దేవాదాయశాఖ కి మంత్రిగా ఒక పనికిమాలిన వ్యక్తి ఉన్నారని వెంటనే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసలు రాష్ట్రం లో హోంమంత్రి ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి లో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఎద్దేవా చేశారు.