శుక్రవారం నాడు ముఖ్మమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన దీక్ష గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వం వైఖరి గాడి తప్పి నట్లు కనిపిస్తుంది. మోడీ మాతో పెట్టుకోకు అన్నట్లు ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. శనివారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన మాటలకు ప్రధాని మోడీ నవ్వుతున్నారు. ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. మోదీపై, బీజేపీ నేతలపై టీడీపీ నేతలు తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తుండటం సబబు కాదని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 2004 ముఖ్యమంత్రికి ఏది ఎదదురయిందో 2019 లో కూడా అదే ఎదురవుతుందని అయన అన్ఆరు. చంద్రబాబు నాయుడు చేసిన దీక్ష కు అనవసరపు ఖర్చు ఇదంతా ప్రజల సొమ్ముఅని అయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కు త్వరలో బిజెపి చుక్కలు చూపిస్తుంది..వచ్చే ఎన్నికల్లో బీజేపీ దే గెలుపని అయన అన్నారు. లయ తప్పి గాడి తప్పినట్లుగా వుంది ప్రభుత్వ వైఖరి. తెలుగుదేశం అక్కసుతో ప్రవర్తిస్తోంది. చివరకు అసంబ్లీని అబద్దాల సభగా మార్చేశారని అయన విమర్శించారు. మోడీని ప్రథమ శత్రువుగా చంద్రబాబు పరిగణిస్తున్నారని ఆయన అన్నారు.