నెల్లూరు జిల్లా గూడూరు మండల తాసిల్దార్ కార్యాలయంలో పౌర సేవలకు అంతరాయం కలిగింది. సుమారు 7 లక్షలు రూపాయలు బకాయిలు ఉన్నాయంటూ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా , తహశీల్దార్ కార్యాలయానికి విద్యుత్ శాఖ సిబ్బంది పవర్ కట్ చేసింది.గూడూరు నియోజకవర్గంలో ఇప్పటికే కోట ఎంపీడీఓ కార్యాలయంలో విద్యుత్ కట్ చేసిన విద్యుత్ సిబ్బంది ఇంకా కొన్ని పరిపాలనా కార్యాలయాలకు కరెంటు కట్ చేసే పనిలో ఉన్నట్టు సమాచారం.ప్రభుత్వ శాఖల సమన్వయ లోపంతో ప్రభుత్వానికి మచ్చ రానుందని ప్రజాభిప్రాయం వినిపిస్తుంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ,వివిధ రకాల రికార్డులు ఆన్ లైన్ పనులతో నిత్యం ఎంతో రద్దీగా ఉండే ప్రభుత్వ కార్యాలయానికి ,ఒక ప్రభుత్వ శాఖ ఇంత నిర్లక్ష్యంగా కరెంటు కట్ చేసై కలిగే నష్టం,పోయే పరువు ఎవరికి?ప్రభుత్వానికి తప్ప కార్యాలయాలకు కాదుగా,ఉద్యోగులు తమ సొంత డబ్బులు లక్షల్లో బకాయిలు కట్టలేరుగా, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లేక సంబంధిత ఉన్నతాధికారులుకు తెలియ చేసి సమస్య పరిష్కారానికి కృషిచేయాలి ,కానీ ఇలా ముందస్తు సమాచారం లేకుండా కరెంటు కట్ చేస్తే ఆన్ లైన్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోతే, చివరగా ఇబ్బందులు పడేది సామాన్యులు .ఈ విషయం విద్యుత్ శాఖ అధికారులుకు తెలియదా?.
తప్పేవరిదో తరువాత , ముందు సామాన్యులకు సేవలందించే ఎమ్మార్వో కార్యాలయానికి ,కరెంటు వెంటనే పునరుద్ధరణ జరపాలని గూడూరు పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.