దేవాలయాల భద్రత కు తమ వంతు సహకారం అందిస్తామని, ఆయా దేవాలయాల కమిటీ సభ్యులు కూడా పర్యవేక్షణ చూసుకోవలసిన బాధ్యత ఉండాలని నెల్లూరు నగర డిఎస్పి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా టౌన్ సబ్ డివిజన్ పరిధిలోని దేవాదాయశాఖ, మత పెద్దలతో టౌన్ డి.యస్.పి. శ్రీనివాసులు రెడ్డి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దేవాలయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు, వాటి భద్రత బాధ్యత, జాగ్రత్తలు తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలిచ్చారు.