YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం విదేశీయం

జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించిన అమెరికన్ కాంగ్రెస్

జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించిన అమెరికన్ కాంగ్రెస్

అమెరికన్ కాంగ్రెస్ జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించింది. అమెరికన్ క్యాపిటల్ భవనం వద్ద హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటం.. బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు.. నిరసనలు చేశారు. ఒక దశలో ఇవి అదుపుతప్పి టియర్ గ్యాస్.. కాల్పులకు దారి తీయటం.. ఒక మహిళా కార్యకర్త తోపాటు మొత్తం నలుగురు మరణించారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ జరిగిన ఈ సమావేశంలో అమెరికన్ కాంగ్రెస్ జోబైడెన్ గెలుపును ధ్రువీకరించింది. దీంతో.. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం లాంఛనం కానుంది.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో జోబైడెన్ గెలుపొందిన తర్వాత కూడా ఈ వ్యవహారం ఏమిటన్న సందేహం రావొచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉండే సంక్లిష్టత కారణంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సుదీర్ఘంగా సాగే ప్రక్రియ. స్పష్టమైన మెజార్టీ సాధించిన తర్వాత కూడా అమెరికా కాంగ్రెస్ ఈ ఎన్నికలను ధ్రువీకరించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇవన్నీ లాంఛనంగా సాగే వ్యవహారాలే. కానీ.. ట్రంప్ లాంటి మొండిఘటం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ కోవలోకే తాజా పరిణామాలుగా చెప్పాలి.నవంబరు 3న వెల్లడైన ఎన్నికల్లో జో బైడెన్ గెలిచినట్లుగా వెల్లడైన సంగతి తెలిసిందే. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారీస్ గెలిపొందారు. షెడ్యూల్ ప్రకారం వీరు జనవరి 20న ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. అంతకు ముందు అమెరికన్ కాంగ్రెస్ వీరి ఎన్నికను ధ్రువీకరించాల్సి ఉంటుంది.అమెరికాలో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావటానికి 270 ఓట్లను సాధించాలి. జో బైడెన్ కు 306 ఓట్లు వచ్చాయి. అంతేకాదు.. 8.12 కోట్ల ఓట్లను సాధించారు. ఇక. . ట్రంప్ 232 ఓట్లను మాత్రమే సాధించినా.. పాపులర్ ఓట్లు మాత్రం 7.42 కోట్లు సొంతం చేసకన్నారు. సీట్ల సంఖ్యలో పెను వ్యత్యాసం ఉన్నా.. ఓట్ల విషయంలో తక్కువ తేడా ఉంది.

Related Posts