రామంతాపూర్ నేహ్రూ నగర్ లోని శ్రీనివాస మిల్క్ పార్లర్ లో ఉన్న రుత్విక్ యాదవ్ (8 ) అనే చిన్నారి ని గుర్తు తెలియని వ్యక్తి మభ్యపెట్టి షాప్ లోంచి రూ .ఐదు వెయ్యిలను తీసుకోవడంతో పాటు తన ద్విచక్ర వాహనంపై చిన్నారిని తీసుకుని వెళ్ళడంతో స్థానికంగా బాలుడి కిడ్నాప్ కలకలం రేగింది .దీనితో బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించి చుట్టు పక్కలా వెతికారు .అయితే గంట తరువాత తిరిగి తల్లితండ్రి దగ్గరకు చేరుకున్న బాలుడు కిడ్నా పర్ తనను శ్రీ చైతన్య కళాశాల వద్ద విడిచి పెట్టి అక్కడే ఉండమని చెప్పి వెళ్లినట్లు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు .కాగా ఈ సంఘటనపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి .