దేవాలయాలపై దాడులు పై గణపతి సచ్చిదానంద స్వామీజీ స్పందించారు. విగ్రహాలపై దేవాలయాల పై దాడులు జరగడం చాలా దురదృష్టకరం అని అయన వ్యాఖ్యానించారు.
దేవాలయాలపై దాడుల వెనుక ఎటువంటి వారినైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వన్ని అయన కోరారు.
ఈ హిందూ ధార్మిక సంస్థల పై దాడులతో ప్రపంచ వ్యాప్తం గా ఉన్న హిందూవులు మనస్సులు దెబ్బ తిన్నాయని స్వామీజీ తెలియచేసారు. హిందూ దెవాలయాల పై జరిగే దాడులను ప్రభుత్వం వెంటనే సమగ్రమైన విచారణ జరపాలని ప్రభుత్వనికి గణపతి సచ్చిదానంద స్వామీజీ సూచించారు. ఇప్పటికే కరోనా తో ప్రపంచమంతా అనేక కష్టాలు పడుతుందని ఆ కష్టాలనుండి బయటపడటాని పరమాత్ముడి వేడుకుంటూ అనేక మంది పూజలు చేస్తుంటే ఈ తరుణంలో దేవాలయాలపై దాడులు విగ్రహాల ద్వంసం చేయటం చాలా దురదృష్టకరమని గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలియచేశారు.