కరీంనగర్ లో గురువారం నాడు ఇన్ కం టాక్స్ అధికారి వేణుగోపాల్ పై దాడి ఘటనపై చేసిన ఇన్ కం టాక్స్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసారు. శుక్రవారం నాడు బషీర్ బాగ్ లోని ఆయాకర్ భవన్ ముందు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. సీ3 ఇన్ఫ్రా కంపెనీ లో రైడ్స్ కు వెళ్లిన అధికారిపై దాడి చేశారు. సీఆర్పీసి 198 యాక్ట్ ప్రకారం అధికారిపై దాడి చేస్తే రెండేళ్ల జైలు శిక్ష విధించాలని వారు అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.