గత 15 నెలలుగా హిందూదేవాలయల మీద దాడులు జరుగుతూఉంటే, అన్యమత ప్రభుత్వం కాబట్టి పట్టించుకోవడం లేదని ఈ విషయమై హిందువులు సిగ్గుతో తల దించుకోవాలసిన పరిస్థితి ఏర్పడిందని బిజెపి నాయకులు కరణం భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రాష్ట్రంలో లో ఇప్పటికి 126 దేవాలయలలో విగ్రహాలు ధ్వసం ,రధాలు తగులపెట్టడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నా ప్రభుత్వం పట్టించుకొనే పరిస్తితి ఎందుకు లేదో మనకు అర్థం కావడం లేదన్నారు.రామతీర్థంలో జరిగిన సంఘటనను చూచుటకు , రాములవారి మందిరాన్ని సందర్శించుటకు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కార్యకర్తలతో కలసి బయలుదేరితే ఈ ప్రభుత్వం పోలీసులను పెట్టి అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. వైస్సార్సీపీ నాయకుడు విజయసాయిరెడ్డిని వారి కార్యకర్తలను , టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడును వాళ్ళ కార్యకర్తలను పోలీసులు దగ్గరుండి రక్షణకల్పించి పంపించారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఈ వివక్షతను హిందూ సాంప్రదాయ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు.
ఈ రెండు పార్టీల ఉద్దేశం అధికారంలో గాని, ప్రతిపక్షం లోగాని వాళ్లే ఉండాలి. ఇంకొక పార్టీ ఇంకొక నాయకుడు అధికారంలోకి రావడం వాళ్లకు మింగుడు పడదు అన్నారు. అయితే వాళ్ల ఆటలు ముగిసే రోజులు వస్తున్నాయి, హిందూ మనో భావాలను గౌరవించే అవకాశం వస్తూవుంది,ఆలస్యంమనదే అన్నారు. ప్రభుత్వం ఇంత ఆలసత్వంగా,వివక్షతగా ఉండటానికి కారణం మనలో చైతన్యం లేక పోవడమే. అందరం ఒకటవుదాం ఈ ప్రభుత్వానికి మనమేమిటో చూపిద్దాం అన్నారు.మనకు వెంకటేశ్వర స్వామి ఒక అవకాశం కల్పించారని, దానిని మనం ఎంత కష్టపడితే, అంత మంచి ఫలితం వస్తుందన్నారు.