నెల్లూరు జిల్లా ,నాయుడుపేట పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం పైభాగంలో ఏర్పాటు చేసే విగ్రహాల నిర్మాణానికి గాను నాయుడుపేట మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ అత్తికాయల సుబ్రహ్మణ్యం రూ 50 వేలు దేవాదాయశాఖ అధికారులకు అందజేశారు.శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన ముఖద్వారం ఏర్పాటు చేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని పూజలు చేసి ద్వారాబంధం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాలయం అన్ని హంగులతో పూర్తి చేసేందుకు దాతలు సహకరిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఈ ఓ వరప్రసాద్ రెడ్డి, వైసీపీ నాయకులు చదలవాడ కుమార్,గుంటూరు లక్ష్మయ్య,గంధవల్లి సిద్ధయ్య, సాధు మోహన్,బాలాజీ మెడికల్స్ మురళీ కృష్ణ, బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.