కులమత బేధాలను రెచ్చ గొట్టి పరిపాలన చేయాల్సిన అవసరం లేదన్నారు ఎపి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తి శ్రీవారిని దర్శించుకున్న ఎపి డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు.దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు .ఏపీలో పండగకు ముందే పండగ వాతావరణం నెలకొందన్నారు.30 లక్షల మందికి పైగా పేదవారికి ఇళ్ల పట్టాలు అందించిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డిదని అన్నారు.చంద్రబు కూల్చిన దేవాలయాలను జగన్ మోహన్ రెడ్డి తిరిగి ప్రారంభిస్తున్నారన్నారు.ప్రధానంగా విజయవాడలో కూల్చిన 9 ఆలయాలను పునఃనిర్మానం చేసేందుకు సీఎం పూనుకున్నారని తెలిపారు.జగన్ సీఎం అయ్యాక తమ నియోజకవర్గంలోని 35 దేవాలయాలను టీటీడీ కిందకు తీసుకు రావడం జరిగిందన్నారు..ప్రజల ఆశీర్వాదంతో జగన్ సీఎం అయ్యాడని ఆయనకు కుల మత ద్వేషాలను రెచ్చగొట్టి పరిపాలన చేయాల్సిన అవసరం లేదన్నారు.పదవి కోసం పాకులాడే వాడు మత విద్వేషాలకు పూనుకున్నారని పేర్కొన్నారు.చంద్రబాబు ఓ మతిస్థిమితం లేని వ్యక్తని,చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల గురించి నేను మాట్లాడనన్నారు. తన తండ్రికి జరిగిన అవమానాన్ని మరిచి దుర్మార్గుడు, చరిత్రహీనుడైన చంద్రబాబు వద్దకు చేరిన బాలకృష్ణ గురించి తను మాట్లాడ ధలుచుకోలేదని తెలిపారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.దేవుడి సన్నిధిలో నిరంతరం భక్తుల సేవలో తరించే ఉద్యోగులకు ఇంటిస్థలలాలను జగన్ ప్రభుత్వం కేటాయించడం శుభపరిణామం.30 సం" లకు పైగా ఇళ్ల స్థలాలను లేని టీటీడీ ఉద్యోగులకు త్వరలోనే ఇళ్ల స్థలను జగన్ ప్రభుత్వం ఇస్తున్నట్టు మీడియాకు వివరించారు