YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

హఫీజ్ పేట భూ భాగోతంలో మంత్రి హస్తం వుంది

హఫీజ్ పేట భూ భాగోతంలో మంత్రి హస్తం వుంది

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హఫీజ్ పేట్ భూముల నేపధ్యంలో కిడ్నాప్ ఉదంతం మరో మలుపు తిరిగింది.  శుక్రవారం నాడు హఫీజ్ పేట్ భూముల పరిరక్షణ కమిటీ  మీడియా సమావేశంలో పలు ఆరోపణలు చేసింది.  ఈ కార్యక్రమానికి హాఫిజ్ పెట్ భూములుకు సబంధించిన 60 మంది బాధితులతో పాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు.  వారు మాట్లాడుతూ 1976 నుండి ఈ భూముల పై కన్నేసిన వ్యక్తులు పేరుమోసిన కబ్జాదారుల గోల్డ్ స్టోన్ ప్రసాద్, సి కళ్యాణ్, వ్యాపారులని ఆరోపించారు.  1867 ఎకరాల భూములను మొతం కబ్జాకు  గురైంది. గత 30 ఏళ్లుగా వివిధ న్యాయస్థానాల్లో కబ్జాదారులు పిటిషన్లు వేసి కాలయాపన చేస్తున్నారని వారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తో పాటు మరో 3 శాఖలతో కుమ్మక్కై ఈ భూములను అక్రమంగా కబ్జా చేశారని వార ఆరోపించారు.
ఈ భూములలో కీలకంగా ఒక మంత్రి ప్రమేయం వుంది. ఈ కేసు ను సీబీఐ విచారించి మాకు న్యాయం చేయాలని సీబీఐ జాయింట్ డైరెక్టర్ కు వినతి పత్రం అందజేసామని వారన్నారు. ఈ అక్రమ భూముల కబ్జాలో ఈపాటికే 12 మంది ని హత్య కి గురయ్యారు. మొన జరిగిన బోయిన్ పల్లి కిడ్నాప్ కూడా దీనిలోని భాగమేనని వారన్నారు.
దీనిపై సీబీఐ అధికారులు జోక్యం చేసుసుకొని విచారించి ఎలా అయినా అక్రమార్కులకు శిక్ష పడేలా చేయాలి. ఈ భూముల కబ్జాలో సినీ పరిశ్రమ, రాజకీయ నాయకులు,పారిశ్రామిక వేతల హస్తం ఉంది. ఇంకా ఇలా కిడ్నప్లు,హత్యలు,బెదిరింపులు జాతగకుండా ఉండాలి అంటే సీబీఐ జ్యోక్యం చేసుకోవాలి. తెలంగాణ తెచ్చుకుంది సి కళ్యాణ్, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ల కోసం కాదని వారన్నారు.
=========================

Related Posts