నసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో మూడు రోజుల పర్యటనను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి. సకల జనుల సర్వే సమయంలో పవన్ కల్యాణ్‌ను 'టూరిస్ట్' అంటూ కామెంట్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఆయన తెలంగాణ యాత్రకు కేసీఆర్ వీసా ఎలా జారీ చేశారో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్ లాంటి 'టూరిస్ట్' నేతకు ఇచ్చిన స్వేచ్ఛను ఉద్యమ నేతలకు ఇవ్వకపోవడం దారుణమని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాటిన ఉద్యమ, జేఏసీ నేతలకు కూడా పవన్ కల్యాణ్ మాదిరిగా వీసాలిస్తే వారికి తాము కనీసం తెలంగాణలో ఉన్నామన్న భావనైనా కలుగుతుందని సూచించారు. ఉద్యమ నేతలను నిర్బంధిస్తుండే తెలంగాణ బిడ్డల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో తెలుస్తుందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.