కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా టీడీపీ ప్రభుత్వం ఎంతో శాంతియుతంగా వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టింది. తెలుగుప్రజలకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వాలను గద్దె దింపే దాకా తెలుగువాడి సత్తా చూపుతామని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. శనివారం నాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని కేంద్ర తీరును నిరసిస్తూ పుట్టపర్తి నియోజకవర్గం లో టీడీపీ చేపట్టిన సైకిల్ యాత్ర ను అయన ప్రారంభించారు. ముందుగా సత్యమ్మ గుడిలో పూజలు నిర్వహించి ,అనంతరం సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు. సైకిల్ యాత్రకు ముందుగా మహిళలు హారతులు ఇచ్చి, టెంకాయలు కొట్టి యాత్ర సాగించారు. యాత్ర పుట్టపర్తి, గోకుళం, ఎనుములపల్లి, బ్రహ్మణపల్లి, బీడుపల్లి, బడేనాయక్ తాండా, గోనేనాయక్ తాండా, కప్పలబండ, మామిల్లకుంట క్రాస్, మీదుగా ఎంతో ఉత్సహ భరితంగా ఎమ్మెల్యే పల్లె తో పాటు టీడీపీ ,నాయకులు,కార్యకర్తలు కొత్తచెరువు వరకు కొనసాగించారు. కొత్తచెరువు సర్కిల లో ఎన్టీఆర్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత పల్లె మాట్లాడుతూ ఏపీ ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్ ను అడ్రెస్ లేకుండా చేసిన చరిత్ర తెలుగు ప్రజలది. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ ని గడగడ లాడించింది అన్న నందమూరి తారకరామారావే. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని అన్నారు. ఏపీ కి అన్యాయం చేసిన ఏ పార్టీని వదలం. బిజెపి ప్రభుత్వం ఏపీ కి విభజన హామీలు, ప్రత్యేక హోదా ను తక్షణం అమలు చేయకపోతే కాంగ్రెస్ పట్టిన గతే బిజేపి కి పడుతుందని అయన అన్నారు. ఏపీ కి జరిగిన అన్యాయం పై కేంద్ర తీరును ఎండగడుతూ,ప్రజల్లోకి తీసుకెళ్తాం. తెలుగు ప్రజల సత్తా చూపిస్తామని అన్నారు.