విశాఖలో మళ్లీ మత్స్యకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. వలల వివాదంలో రెండు వర్గాలు పర్సరం దాడులు చేసుకున్నాయి. సముద్రంలోనే పడవలపైన రింగు వలల మత్స్యకారులు, సంప్రదాయ మత్స్యకారుల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇక పోలీసులు రగంలోకి దిగడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తతగా మారింది. ఓ వర్గం మత్స్యకారులు వలలు చించేసి గొడవకు దిగారు.దీంతో పరిస్దితి అదుపు తప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేశారు.రింగ్ వలలతో తమకు అన్యాయం చేస్తే సహించేది లేదని సాంప్రదాయ మత్య్సకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.