గిఫ్ట్ పేరు తో ఫ్రాడ్ చేస్తున్న ముఠా గుట్టును రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ టీం రట్టు చేసింది. ఈ కేసు వివరాలు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు ఢిల్లీ నుంచి రాకెట్ నడిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్ తయారుచేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. అబ్బాయి తో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయి లాగా చాటింగ్ చేయడం మొదలుపెడతారు. హైదరాబాద్ కు చెందిన అబ్బాయి తో సోఫియా అనే అమ్మాయి పేరు తో రిక్వెస్ట్ వచ్చింది. మీకోసం ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వస్తున్నాను అని మెసేజ్ పెట్టింది. ముంబై ఎయిర్ పోర్ట్ ల్యాండ్ అయ్యాను. నా దగ్గర 75వేల పౌండ్స్ క్యాష్, గోల్డ్ చైన్స్, మొబైల్ ఫోన్స్ కు కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలని బాధితుడితో డబ్బులు వేయించుకున్నారు. ఇలాంటి ముఠా సభ్యులు ఢిల్లీలో ఒక చోట కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని అయన వెల్లడించారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసాం. నిందితుల పై పిడియాక్ట్ కూడా నమోదు చేస్తాం. డింగ్ టోన్ అనే ఆప్ ని ఉపయోగించి అమాయకులను మోసం చేస్తున్నారు. తమ అకౌంట్లో వేయించుకున్న నగదుతో ఢిల్లీలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. గుర్తు తెలియని వారి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకూడదు. ఇలాంటి తరహాలో మోసాలే మ్యాట్రిమోనీ పెరుతో కూడా జరుగుతున్నాయి. జేమ్స్ బాండ్ లాగా ప్రొఫైల్ తయారు చేసి మోసం చేస్తున్నారు. రాచకొండ పరిధీలో ఏడుగురు వీరిలో చేతిలో మోసపోయినట్టు గుర్తించామని అయన అన్నారు.