YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

అకాల వర్షానికి నేలకొరిగిన పంటలు వర్షానికి దెబ్బతిన్న శనగ,వాము తదితర పంటలు తీవ్ర నిరాశతో రైతులు

అకాల వర్షానికి నేలకొరిగిన పంటలు   వర్షానికి దెబ్బతిన్న శనగ,వాము తదితర పంటలు తీవ్ర నిరాశతో రైతులు

పత్తికొండ పరిధిలోని తుగ్గలి,మద్దికెర, పత్తికొండ తదితర మండలాల్లో గత 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి శనగ,వాము తదితర పంటలు పూర్తిగా తడిసి నేలకొరిగిపోయాయి.మంచి పూత మరియు పింజ దశలో పంట పొలాలపై వర్షం పడడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తుగ్గలి,మద్దికెర మరియు పత్తికొండ మండలాల పరిధిలో వేల హెక్టర్ లో గల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంట చేతికొచ్చే దశలో అకాల వర్షం పూర్తిగా రైతులను దెబ్బతీసిందని రైతులు తెలియజేస్తున్నారు.గత సంవత్సరం కూడా ఇదే పూత దశలో ఉన్నప్పుడు వర్షం కురిసి రైతులకు తీవ్ర నష్టాన్ని ఏర్పాటు చేసిందని రైతులు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం పెరిగిన లేబర్ చార్జీలతో పాటుగా పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో రైతులు ఏ దశలో కోలుకోలేక అప్పులు మితిమీరి పోయిన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రైతుల బాగు కోరే ప్రభుత్వాలు ఎక్కడ లేవని,అందువల్లనే రైతుల పరిస్థితి ఇంత ఘోరంగా ఉందని రైతులు తెలియజేస్తున్నారు.ఏటా కొన్ని వందల మంది రైతులు అప్పుల బాధ తాళలేక మృతి చెందుతున్న ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts