రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు పరవాడ తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు ఏ రామస్వామి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ బిల్లులు ఉప సంహరించు కోవాలని డిమాండ్ చేశారు ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న మోడీ ప్రభుత్వానికి చలనం లేకపోవడం దుర్మార్గమన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గని శెట్టి సత్యనారాయణ ఏ సన్యాసిరావు వీర్రాజు ముత్యాలు తదితరులు పాల్గొన్నారు అనంతరం తాసిల్దార్ బి వి రాణి గారికి మెమోరాండం ఇచ్చారు.