YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాల్యవివాహాలను ఆరికట్టాడానికే చంద్రన్న పెళ్లికానుకలు

బాల్యవివాహాలను ఆరికట్టాడానికే చంద్రన్న పెళ్లికానుకలు

పీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెళ్ళి కానుకను మంత్రి గంటా శ్రీనివాసరావు అందజేశారు. శనివారం నాడు విశాఖపట్నం  సింహాచలం పుణ్యక్షేత్రంలోని  పుష్కరణి సత్రం లో జరిగినఒక  వివాహం లో చంద్రన్న కానుకలో భాగంగా వివాహా దృవ పత్రం, పెళ్లి కానుకలు మంత్రి గంటా శ్రీనివాసరావు అందజేశారు. రాష్ట్రం లోనే చంద్రన్న పెళ్ళి కానుక తీసుకొన్న మొదటి వివాహమని అయన అన్నారు. ఈ కులాంత వివాహంలో వధువు ఎస్సీ సమాజిక వర్గానికి చెందినది.  ప్రభుత్వం తరపున వీరికి డెబ్బై అయిదు వేల రూపాయలు బ్యాంకు లో డిపాజిట్ అవుతాయి. దానికి  అదనంగా మంత్రి  ముప్ఫై వేల రూపాయలు, స్థానిక  ఏమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పది వేల రూపాయలు అందచేశారు. మంత్రి మాట్లాడుతూ  చంద్రన్న పెళ్ళి కానుక చాలా అపురూపమైన కార్యక్రమం. పేదవారు పెళ్ళి గురించి బెంగ పెట్టుకొనే అవసరం లేదని అన్నారు. దివ్యాంగులకు లక్ష రూపాయలు,  బి.సి లకు రూ 35000, ఎస్సీలకు రూ   40000,  గిరిజనుల కు రూ 50000 ఇస్తున్నామని మంత్రి తెలిపారు. భవన కార్మికులు ఎవరైనా ఉంటే వారికీ రై 20000 ఇస్తామని అన్నారు.  బాల్య వివాహాల వలన కలిగే నష్టాలను చెపుతూ చంద్రన్న కానుకల ద్వారా వివాహా ధ్రువపత్రాన్ని వివాహా ప్రాంగణం దగ్గర అందచేస్తామని మంత్రి తెలియచేసారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సిరి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్, స్థానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హజరయ్యారు.

Related Posts