స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఏపీలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సీఎం జగన్ చూసి చంద్రబాబుకు వణుకు పుట్టింది. రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించే విధముగా మతరాజకీయలు చేస్తున్నారు చంద్రబాబని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. మత రాజకీయాలు చేసేవారి ఆట కట్టించే పనిలో ప్రభుత్వం ఉంది. 14 సం" ఏపీని ముఖ్యమంత్రిగా పరిపాలించిన చంద్రబాబు ప్రధాన ఆలయాల వద్ద ఎన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు ? ప్రస్తుత సీఎం అన్ని దేవాలయాల వద్ద 35 వేల సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపం కూల్చడం శోచనీయమని అయన అన్నారు.
వెయ్యికాళ్ల మండపం కూల్చిన రోజు చిన్న జీయర్ స్వామి చాలా బాధకు లోనయ్యారు. వెయ్యి కాళ్ల మండపం కూల్చడం దైవ తప్పిదం అని చిన్న జీయర్ స్వామి అన్నారు. రాజమండ్రి పుష్కరాల్లో ఎన్టీఆర్ బొమ్మతో శ్రీకృష్ణుడి ప్రతిమను పెట్టి అపహాస్యం చేశారు చంద్రబాబు. కృష్ణపుష్కరాల్లో దేవాలయాలను తొలగించి బాత్ రూములు నిర్మించిన ఘనత మీదే. చంద్రబాబు తొలగించిన ఆలయాలను నేడు దశమి రోజు పునః నిర్మానం చేయనున్నారు జగన్. ఆరు నెలల కాలంలో అన్ని ఆలయాలను నిర్మిస్తున్నాం. పాద రక్షులు లేకుండా తిరుమలకు వచ్చిన ఏకైక వ్యక్తి జగన్.
బీజేపీ,టీడీపీ నాయకులు ఎవరైనా పాదరక్షలు లేకుండా తిరుమలకు నడిచిన సందర్భాలు ఉన్నాయా ?
ముఖ్యమంత్రి గుండెల్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ప్రత్యేక హోదాపై సీఎం కంకణ భద్రుడు అయి ఉన్నారు. చంద్రబాబులా యూ టర్న్ తీసుకోలేదు.ప్రత్యేక హోదాపై అవకాశం వచ్చినపుడల్లా కేంద్రం పై ఒత్తిడి తెస్తున్నారు జగన్. సమయం సందర్భం చూసి కచ్చితంగా ప్రత్యేక హోదా సాధించుకునే వత్తిడి తెస్తామని అన్నారు