YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఆలయాల పునర్నిర్మాణానికి శ్రీకారం భూమి పూజలు చేసిన సీఎం జగన్

ఆలయాల పునర్నిర్మాణానికి శ్రీకారం భూమి పూజలు చేసిన సీఎం జగన్

విజయవాడలో తొమ్మిది దేవాలయాల పునర్ నిర్మాణానికి  శుక్రవారం  సీఎం వై ఎస్ జగన్ భూమిపూజ చేసారు. దీంతోపాటు బెజవాడ కనకదుర్గమ్మ గుడి అభివృద్ది, విస్తరణలో భాగంగా రూ. 77 కోట్లతో చేపట్టిన మరో ఎనిమిది పనులకు కూడా సీఎం భూమిపూజ చేసారు. ఉదయం 11.01 గంటలకు శనీశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేపట్టనున్న ప్రాంతంలో రెండు వేర్వేరు శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. నగరంలొరి  రాహు – కేతు ఆలయం,  శ్రీ సీతమ్మ పాదాలు,  దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయం (సీతమ్మ పాదాలకు సమీపంలో),  శ్రీ శనీశ్వర ఆలయం పునర్ నిర్మాణం,  బొడ్డు బొమ్మ,  శ్రీ ఆంజనేయస్వామి ఆలయం (దుర్గగుడి మెట్ల వద్ద),  శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం,  వీరబాబు ఆలయం (పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలో), కనకదుర్గ నగర్లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాలలను పునర్మించనున్నారు.
భూమి పూజ అనంతరం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. రూ. 77 కోట్లతో దుర్గగుడి అభివృద్ది, విస్తరణ పనులకు శంకుస్ధాపన చేసారు. రూ.8.5 కోట్లతో ప్రసాదంపోటు భవన పునర్నిర్మాణం,   రూ.5.6 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం,  రూ.2 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకారం విస్తరణ, రూ.23.6 కోట్లతో కేశఖండనశాల భవన నిర్మాణం,  రూ.19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణం,  రూ.5.25 కోట్లతో కనకదుర్గ టోల్ప్లాజా నిర్మాణం, రూ.6.5 కోట్ల నిధులతో ఘాట్ రోడ్లో మరమ్మతులు, కొండచరియలు విరిగి పడకుండా మరమ్మతులు, పటిష్ట చర్యలు,  రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ పనులు జరగనున్నాయి.

Related Posts