జాతీయ లోక్ అదాలత్ ను ఆది వారం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ అధ్యక్షులు వి.బి.నిర్మలా గీతాంబ తెలిపారు. 22వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ పై శని వారం ఒక ప్రకటనను విడుదల చేసారు. 22వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్స్ యాక్ట్ కేసులు, మోటారు ఏక్సిడెంట్ క్లైముల కేసులు, ఫ్యామిలీ కోర్టు కేసులు, లేబర్ కేసులు, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లుల కేసులు, ప్రభుత్వ భూ సేకరణ కేసులు, బ్యాంకు కేసులు, సివిల్ కేసులు, రెవిన్యూ కేసులు, పే అండ్ అలవెన్సుకు సంబంధించిన సర్వీసు మేటర్ కేసులు, పాత పెండింగు కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు ఇందులో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు. ఆది వారం ఉదయం 10.30 గంటల నుండి జిల్లా కోర్టుతో సహా జిల్లాలోగల అన్ని కోర్టుల పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మొత్తం 17 బెంచీలను జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకుని, సత్వర న్యాయం పొందాలని ఆమె కోరారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.