విజయనగరం జిల్లా రామతీర్థం రాముని విగ్రహ ధ్వంసం కేసులో సీఐడీ, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విగ్రహాన్ని కరెంట్ రంపంతో సాయంతో ధ్వంసం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఒక ఘటనలో కోతకు ఉపయోగించిన కరెంట్ రంపాన్ని స్వాధీనం చేసుకున్నారు.. ఆ రంపంతోనే కృష్ణాజిల్లా, రాజమండ్రిలో జరిగిన రెండు ఘటనల్లోనూ ఉపయోగించినట్లు గుర్తించినట్లు శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అన్నారు. మొత్తం 23 కేసులు నమోదవ్వగా.. 10 కేసుల్లో విచారణ జరుగుతోంది అన్నారు. కేసుల దర్యాప్తులో ఆధారాలను సాంకేతికంగా, ఇతర రూపాల్లో సేకరిస్తున్నామని వాటిని క్రోడీకరించి నిందితులను పట్టుకుంటామన్నారు.. వారి వెనుక ఉన్న వారిని అరెస్టు చేస్తామన్నారు.ఇప్పటికే పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకోగా.. ఆధారాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో పేర్లు వెల్లడించలేకపోతున్నారట. పది పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నారని.. వారి కాల్ డేటా ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేస్తోందట. ముందే ఒక అభిప్రాయానికి వచ్చి దర్యాప్తు చేయడం లేదని, సీసీ కెమెరాలు, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారట. త్వరలోనే పక్కా ఆధారాలతో నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.మరోవైపు రామతీర్థం ఘటనకు సంబంధించి కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. దేవాలయంలో విగ్రహాల ధ్వంసం చేసిన ఇద్దర్ని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరి దగ్గర్నుంచి ఎలక్ట్రికల్ రంపాన్ని స్వాధీనం చేసుకున్నారట..రెండు దేవాలయాల్లో విగ్రహాలను ఎలక్ట్రికల్ రంపంతో కోసినట్లు గుర్తించారట. విశాఖకకు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. రెండు ఆలయాలతో పాటూ మరో రెండు చోట్ల రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.