ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 77 వలన ప్రైవేట్ , ఎయిడెడ్ , ఆన్ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు 2020 - 21 వ సంవత్సరం నుండి జగనన్న విద్యా దీవెన , జగనన్న వసతి దీవెనలను నిలిపివేస్తూ 77 జీవోను విడుదల చేసిందని దీనిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ నంద్యాల ఆర్డిఓ ఆఫీస్ ఈవో కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు .ఈ సందర్భంగా తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్ఎస్ఎఫ్) నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ముద్దం నాగ నవీన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే 90% విద్యార్థులు పీజీ కోర్సులైన్ యంఏ , ఎంకామ్ , ఎమ్మెస్సీ , ఎంసీఏ , ఎంబీఏ , ఎమ్ఇడి వైపు మొగ్గు చూపుతున్నారని. ఈ పథకం నిలుపుదల తో ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ , అగ్రవర్ణ పేద విద్యార్థులకు పూర్తిగా ఫీజులు కట్టి చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేలకు వేలు ఫీజులు చెల్లించి కళాశాలలో చేరి హాస్టల్లో ఉండి చదువుకునే స్తోమత లేక పీజీ విద్య ఒక అందరిని ద్రాక్షలా మారే అవకాశం ఉంది . ఇప్పటికే విదేశీ విద్యా నిధి పథకం రద్దు తో విద్యార్థులు విదేశీ విద్యకు దూరమయ్యారు , ఎన్నికల మేనిఫెస్టోలో ఏ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థి కూడా ఒక్కపైసా కూడా ఫీజు చెల్లించాల్సిన పని లేదు మొత్తం ఫీజు ప్రభుత్వమే భరిస్తుందని నమ్మబలికిన ప్రభుత్వం ఇప్పుడు ఈ జిఓ 77 ద్వారా విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుందని, విద్యార్థులకు కొత్త పథకాలు అందించక పోగ , గత ప్రభుత్వం చేపట్టిన పథకాలకే పేర్లు మార్చి కొన్ని కొనసాగిస్తూ , మరి కొన్నిటిని నీరుగారుస్తున్నారని , ప్రభుత్వ కళాశాలలో తప్ప ఇంకా ఏ కళాశాలలో పీజీ చదవాలన్న వేలకు వేలు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని , ఓ పక్క రాష్ట్రంలో ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని , ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని , వెనకబడిన బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత చదువులు జగన్ ప్రభుత్వం దూరం చేస్తుందని , కావున వెంటనే ఎస్సీ , ఎస్టీ ,బీసీ , మైనార్టీ అగ్రవర్ణ పేదల విద్య పట్ల ఆటంకంగా మారిన జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో ఆనందు , సుదర్శన , దస్తగిరి , బాలు , కుమార్ తదితరులు పాల్గొన్నారు.